ఇది జ‌ల‌పాతం కాదు…ఢిల్లీ ప్లైఓవ‌ర్‌…

ఢిల్లీలో గ‌త కొన్ని రోజులుగా భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి.  మంగ‌ళవారం రోజున రికార్డు స్థాయిలో భారీ వ‌ర్షం కురిసింది.  దీంతో రోడ్లన్ని సెల‌యేరుల్లా మారిపోయాయి.  భారీ వ‌ర్షానికి రోడ్ల‌తో పాటుగా ఫ్లైఓవ‌ర్ల‌కు కూడా వ‌ర్షం నీటితో నిడిపోయాయి.  ఫ్లైఓవ‌ర్ల నుంచి నీరు కింద‌కు జ‌ల‌పాతంలా జారిప‌డుతున్న‌ది.  ఆ దృశ్యాల‌ను చూసిన కొంత‌మంది న‌యగార జ‌ల‌పాతం ఢిల్లీకి వ‌చ్చింద‌ని కామెంట్స్ చేస్తున్నారు. వికాస్ పురి ప్రాంతంలోని ఫ్లైఓవ‌ర్ పై నుంచి వ‌ర్షం నీరు కింద‌కు ప‌డుతున్న దృశ్యాలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.  గ‌త 24 గంటల్లో ఢిల్లీలో 112.1 మిమీ వ‌ర్ష‌పాతం న‌మోదైంది.  మ‌రికోన్ని రోజులు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉందని, ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ప్ర‌భుత్వం హెచ్చిరించింది.  

Read: సీలింగ్‌లో ఇరుక్కున్న బాలిక త‌ల‌… గంట‌కు పైగా క‌ష్ట‌ప‌డి…

Related Articles

Latest Articles

-Advertisement-