ట్విట్టర్ కు ఢిల్లీ హైకోర్టు షాక్

ట్విట్టర్ కు ఢిల్లీ హై కోర్టు షాక్ ఇచ్చింది. నూతన ఐటీ రూల్స్ ట్విట్టర్ పాటించాల్సిందేనని హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం నిబంధనలు ట్విట్టర్ పాటించడం లేదన్న పిటిషన్ పై విచారణ జరిగింది. ఈ అంశంపై తమ వైఖరి తెలపాలని కేంద్రంతో పాటు ట్విట్టర్ కు నోటీసులు జారీ చేసింది. నూతన ఐటీ నిబంధనలు పాటిస్తున్నామని… గ్రీవెన్స్ అధికారిని సైతం నియమించినట్లు ట్విట్టర్ తెలిపింది. అయితే ట్విట్టర్ వాదనను కేంద్రం తప్పుబట్టింది. ఇరు పక్షాల వాదనలను విన్న జస్టిస్ రేఖ పల్లి.. ట్విటర్ కు నోటీసులు ఇచ్చారు. తదుపరి విచారణను జూన్ 6కు వాయిదా వేశారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-