5జీ పిటిష‌న్ కొట్టివేత‌.. జూహీ చావ్లాకు రూ.20 ల‌క్ష‌ల జ‌రిమానా..

బాలీవుడ్ న‌టి జూహీ చావ్లాకు గ‌ట్టి షాక్ త‌గిలింది.. 5జీ వైర్‌లెస్ నెట్‌వ‌ర్క్‌కు సంబంధించి ఇండియాలో ట్ర‌య‌ల్స్‌ను వ్య‌తిరేకిస్తూ ఆమె ఢిల్లీ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేయ‌గా.. ఇవాళ ఆ పిటిష‌న్‌ను కొట్టివేసిన హైకోర్టు.. ఆమెకు భారీగా జ‌రిమానా విధించింది… జూహీ చావ్లా.. న్యాయ వ్య‌వ‌స్థ‌ను దుర్వినియోగం చేసింద‌ని ఆ సంద‌ర్భంగా వ్యాఖ్యానించిన హైకోర్టు.. కేవ‌లం ప‌బ్లిసిటీ కోసం ఈ పిటిష‌న్ వేసిన‌ట్టుగా ఉంద‌ని పేర్కొంది.. చ‌ట్ట ప్ర‌క్రియ‌ను దుర్వినియోగం చేసినందుకు గాను జూహీ చావ్లా స‌హా ముగ్గురికి రూ. 20 ల‌క్ష జ‌రిమానా విధించిన‌ట్టు హైకోర్టు స్ప‌ష్టం చేసింది..

కాగా, జూవీ చావ్లా.. త‌న పిటిష‌న్‌లో 5జీ త‌రంగాల నుంచి వెలువ‌డే రేడియేషన్.. మానవులపై, ఇతర జీవులపై ప్రభావం చూపే అవ‌కాశం ఉంద‌ని.. దీనిపై ప‌రిశోధ‌న చేయించాల‌ని కోరారు.. 5 జి టెక్నాలజీ మానవులకు, జంతువులు మరియు పక్షులతో సహా ఇతర జీవులకు ప్రస్తుతానికి మాత్రమే కాకుండా భవిష్యత్తులో కూడా సురక్షితం అని సంబంధిత విభాగం నుండి ధృవీక‌ర‌ణ ప‌త్రాన్ని కోరారు. అయితే, వర్చువల్ హియరింగ్‌కు లింక్‌ను జూవీ చావ్లా సోషల్ మీడియాలో షేర్ చేశార‌ని.. దీంతో.. మూడుసార్లు విచార‌ణ‌కు అడ్డంకులు ఎదురైన‌ట్టు కోర్టు పేర్కొంది.. అంతేకాదు, విచార‌ణ సంద‌ర్భంగా అడ్డంకులు సృష్టించిన వ్య‌క్తుల‌ను గుర్తించి, త‌గిన చర్య‌లు తీసుకోవాల‌ని ఢిల్లీ పోలీసుల‌ను ఆదేశించింది హైకోర్టు. అయితే, బుధవారం విచార‌ణ సంద‌ర్భంగా ఓ వ్యక్తి కోర్టు కార్య‌క‌లాపాల‌కు అంత‌రాయం క‌లిగించాడు.. వ‌ర్చువ‌ల్ విచార‌ణ లింక్ ఓపెన్ చేసి.. అందులో జూహీ చావ్లా చిత్రాల నుంచి పాట‌లు పాడి అంత‌రాయం సృష్టించాడు. ఈ వ్య‌వ‌హార్ని హైకోర్టు సీరియ‌స్‌గా తీసుకుంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-