కరోనాపై పోరులో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ఢిల్లీ సర్కార్..!

గడిచిన రెండేళ్లుగా ప్రపంచం కరోనాతో కాకవికలమవుతోంది. చైనాలోని వూహాన్ నగరంలో పుట్టిన కరోనా మహమ్మరి క్రమంగా ప్రపంచ దేశాలకు పాకింది. కరోనా ఎంట్రీతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. ఎంతోమంది అమాయకులు ఈ మహమ్మరి బారినపడి మృతిచెందారు. మరికొంతమంది మృత్యువు అంచులదాకా వెళ్లి బయటపడిన సంఘటనలు ఉన్నాయి. కరోనా ఫస్ట్ వేవ్ లో అమెరికా, ఇటలీ, బ్రిటన్ వంటి అగ్రదేశాలు ఎక్కువగా నష్టపోయాయి.

భారత్ తొలి వేవ్ ను సమర్థవంతంగా ఎదుర్కొంది. అయితే ఊహించని విధంగా సెకండ్ వేవ్ రావడంతో భారత్ ఎక్కువగా నష్టపోవాల్సి వచ్చింది. ఆయా రాష్ట్రాలు సంపూర్ణ లాక్డౌన్, పాక్షిక లాక్డౌన్, నైట్ కర్ఫ్యూ వంటివి అమలుచేసి కొంతమేర కరోనా కట్టడిని చేయగలిగాయి. అయితే ఈ సమయంలో ఆక్సిజన్ కొరత ఏర్పడటంతో పెద్దమొత్తంలో ప్రాణనష్టం జరిగిందని తెలుస్తోంది. ప్రజలంతా కరోనాపై అవగాహన పెంచుకోవడంతో క్రమంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతూ వచ్చాయి.

ప్రస్తుతం దేశంలో కరోనా కట్టడిలోనే ఉంది. అయితే కేరళ వంటి రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టకపోవడం ఆందోళన రేపుతోంది. ఇదే సమయంలో పలు రాష్ట్రాలో కరోనా తగ్గుముఖం పట్టడంతో జనాలు ఇష్టారీతిన తిరుగుతున్నారు. రాజకీయ సభలు, సమావేశాలు, పండుగల పేరుతో జనాలు గుంపుగుంపులుగా తిరుగుతుండటంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. కరోనా ఇంకా పూర్తిగా తగ్గుముఖం పట్టలేదని అది ఏక్షణానైనా మళ్లీ విజృంభించే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తోంది.

మిగతా దేశాలతో పోలిస్తే మనదేశంలో కరోనా వ్యాక్సిన్లు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఉచితంగానే ప్రభుత్వం అందరికీ వ్యాక్సిన్ వేసేందుకు ముందుకొచ్చింది. అయితే కొందరు మాత్రం ఇంకా వ్యాక్సిన్ వేసుకునేందుకు వెనుకాడుతున్నారు. కరోనాను అరికట్టాలంటే వ్యాక్సిన్ వేయించుకోవడం ఒకటే మార్గం. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఢిల్లీ సర్కారు తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. క్రేజీ సర్కార్ కొత్తగా ప్రవేశపెట్టిన ఈ రూల్ ను దేశం అంతటికీ వర్తింపజేయాలని పలువురు కోరుతున్నారు.

కరోనా కట్టడిలో భాగంగా అక్టోబర్ 16 నుంచి ఢిల్లీ సర్కారు కొత్త రూల్ తీసుకొచ్చింది. ఈమేరకు కేజ్రీవాల్ సర్కార్ కీలక ప్రకటన చేసింది. ఈనెల 16 తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులంతా కనీసం ఒక డోసు వ్యాక్సిన్ వేసుకోవటం తప్పనిసరి అని తేల్చిచెప్పింది. కనీసం ఒక్క డోస్ టీకా కూడా వేయించుకోని వారు కార్యాలయాలకు రానివవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగులంతా ఒక్క డోసు వేయించుకునే వరకు వారి పని దినాలను సెలవు దినాలుగా పరిగణిస్తామని పేర్కొంది.

ఢిల్లీలో కరోనా కేసులు ఒకనొక సమయంలో భయాంకరంగా పెరిగిపోయాయి. అలాంటి పరిస్థితుల నుంచి ఢిల్లీ క్రమంగా బయట పడింది.  అయితే ఇంకా కొంతమంది కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ఈనేపథ్యంలో కేజ్రీవాల్ సర్కార్ అలాంటి వారి విషయంలో కోరడా ఝళిపించేందుకు సిద్ధమైంది. కరోనా కట్టడికి ఈ ఫార్మూలా వర్కౌట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో దేశమంతా ఈ రూల్ ను అమలు చేయాలని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

-Advertisement-కరోనాపై పోరులో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ఢిల్లీ సర్కార్..!

Related Articles

Latest Articles