వాయు కాలుష్యం : లాక్ డౌన్ సిధ్దమేనన్న కేజ్రీవాల్ ప్రభుత్వం…

ఢిల్లీలో “సంక్షోభం లాంటి పరిస్థితి” ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ రోజు తిరిగి సర్వోన్నత న్యాయస్థానం లో విచారణ ప్రారంభం అయింది. పంట వ్యర్ధాలను కాల్చడం ద్వారా కలిగే వాయు కాలుష్యం కేవలం 10 శాతమే అని నిర్ధారణ అయుందని ధర్మాసనానికి వివరించారు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా. అయుతే, “దేశ రాజధాని ప్రాంతం” ( ఎన్.సి.ఆర్) పరిధిలోకి వచ్చే ఢిల్లీ పొరుగు ప్రాంతాల్లో కూడా నిర్దిష్ట పరిమితులు, నిబంధనలు అమలు చేయాలని అఫిడవిట్ లో పేర్కొంది కేజ్రీవాల్ ప్రభుత్వం. వాయు కాలుష్య నియంత్రణ లో ఢిల్లీ కున్న పరిధి పరిమితంగా ఉందని, ఇరుగు పొరుగు ప్రాంతాల్లో కూడా ఖచ్చితమైన నిబంధనలు పాటిస్తేనే అర్దవంతంగా ఉంటుందని పేర్కొంది కేజ్రీవాల్ ప్రభుత్వం.

“లాక్ డౌన్” విధింపుకు మేము సిధ్దమే. అయుతే,“ఎన్.సి.ఆర్ వాయు కాలుష్య నియంత్రణ కమిషన్” లేదా కేంద్ర ప్రభుత్వం కానీ అదే తరహాలో నిబంధనలను దేశ రాజధాని ప్రాంతంలో కూడా విధించాలని కోరింది ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటివరకు తీసుకున్న చర్యలను వివరించిన కేజ్రావాల్ ప్రభుత్వం… మూడు రోజుల పాటు, ఢిల్లీలో అన్ని నిర్మాణ పనులు నిలిపివేసిఇంది. ఈ వారం ఆసాంతం పాఠశాలలు మూసివేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేసేందుకు ఆదేశాలు ఇచ్చారు. ప్రైవేట్ ఉద్యోగులు కూడా అదే విధంగా ఇంటి నుంచి పనిచేయాలని సూచించారు.

ఢిల్లీలో అత్యంత ప్రమాదకరంగా, ప్రాణాంతకంగా ఉన్న వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఓ అత్యవసర ప్రణాళిక ను తెలపాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి. రమణ. “రెండు రోజుల పాటు “లాక్ డౌన్” విధిస్తారా…!? ఏలాంటి అత్యవసర చర్యలు తీసుకోవాలనుకుంటున్నారో తెలియజేయండి. “వాయు నాణ్యత సూచిక” ( ఎయుర్ క్వాలిటీ ఇండెక్స్) స్థాయిలు తగ్గించేందుకు మీ ప్రణాళికలు ఏమిటో లిఖిత పూర్వకంగా కోర్టుకు సోమవారం ( ఈరోజు) సమర్పించాలని గత శనివారం కేంద్రానికి, సంబంధిత రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసారు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ. “వాయు నాణ్యత సూచిక” ( ఎయుర్ క్వాలిటీ ఇండెక్స్) గత శుక్రవారం 471 గా నమోదు. ఈ సీజన్‌లో ఇది అత్యంత గరిష్టం. న శనివారం 437 గా నమోదు. ఆదివారానికి సూచిక స్థాయు 330 కు పడిపోయింది. పంజాబ్, హర్యానాలలో పంట వ్యర్థాల కాల్చివేత బాగా తగ్గిపోవడంతో, వాయుకాలుష్య తీవ్రత స్థాయు కూడా తగ్గుముఖం పట్టింది.

Related Articles

Latest Articles