కేజ్రీవాల్ హామీల జల్లు..యువత ఆప్ బుట్టలో పడతారా?

ఐదురాష్ట్రాల ఎన్నికలపై ఫోకస్ పెట్టింది ఆమ్ ఆద్మీ పార్టీ. ముఖ్యంగా పంజాబ్​ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అరవింద్ కేజ్రీవాల్. మరోవైపు అధికారం తమదగ్గరే వుంచుకునేందుకు కాంగ్రెస్​ సహా మిగిలిన పార్టీలు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నాయి. ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి వ్యూహాలు రచిస్తున్న పార్టీలు హామీల జల్లులు కురిపిస్తున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ 10 సూత్రాలతో ‘పంజాబ్​ మోడల్​’ పేరుతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని ప్రజల ముందుకొచ్చారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు 10 సూత్రాలను ఆయన ఓటర్ల ముందుకి తెచ్చారు.

సంపన్నమైన పంజాబ్‌గా తీర్చిదిద్దుతాం. ఫలితంగా ఉపాధి కోసం కెనడా వెళ్లిన యువత తిరిగి ఇక్కడికే వచ్చి ఉద్యోగం చేసుకునేలా ఉపాధి అవకాశాలు కల్పిస్తాం అంటున్నారు కేజ్రీవాల్. భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పిస్తాం అనీ, 300 యూనిట్లు వరకు 24/7 ఉచితంగా విద్యుత్​ అందిస్తాం అంటున్నారు ఆప్ అధినేత.

హైదరాబాద్ ప్రజలకు అలర్ట్… ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్తున్నారా?

పంజాబ్‌లో నిత్యం జరుగుతున్న మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఫోకస్ పెడతామని, శాంతి, సామరస్యం, సౌభ్రాతృత్వం నెలకొల్పుతాం.మతవిద్వేషాల కేసుల్లో బాధితులకు న్యాయం చేస్తాం అంటూ హామీలు ఇచ్చారు. పేదలకు వైద్యం కోసం 16వేల మొహల్లా క్లినిక్‌లను ఏర్పాటు చేస్తాం అన్నారు. విద్య, ఆరోగ్య వ్యవస్థను మెరుగుపరచడం.18 ఏళ్లు దాటిన మహిళలకు నెలనెలా రూ.1000 ఇస్తాం.రైతుల సమస్యలను పరిష్కరిస్తాం అన్నారు. మార్పు కావాలంటే ఆప్‌ని గెలిపించమంటున్నారు.

కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు నశించాయని, సీఎం చరణ్​జిత్​ సింగ్​ చన్నీ నేతృత్వంలోని పంజాబ్​ సర్కారుపై కేజ్రీవాల్​నిప్పులు కురిపించారు. పంజాబ్‌ ఎన్నికల్లో సిక్కు వర్గానికి చెందిన వ్యక్తినే సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశం వుందంటున్నారు. ఫిబ్రవరి 14న రాష్ట్రంలోని 117 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు జరుగుతాయి. కౌంటింగ్ మార్చి 10న నిర్వహించనున్నారు. కేజ్రీవాల్ హామీలను యువత నమ్మి ఓటేస్తారా?

Related Articles

Latest Articles