ఆప్ హామీః 300 యూనిట్ల వ‌ర‌కూ క‌రెంట్ ఫ్రీ…పాత బిల్లులు కూడా…

సామాన్యుడి పార్టీ పంజాబ్‌పై క‌న్నేసింది.  పంజాబ్ రాష్ట్రానికి త్వ‌ర‌లోనే ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి.  ఆ ఎన్నిక‌ల్లో త‌న ముద్ర‌ను వేసుకోవాల‌ని చూస్తోన్న‌ది ఆప్‌.  ఇందులో భాగంగానే ఉచిత విద్యుత్ అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్న‌ది.  గ‌తంలో 200 యూనిట్ల వ‌ర‌కు ఉచిత విద్యుత్‌ను అందిస్తామ‌ని ప్ర‌క‌టించిన ఆప్, ఇప్పుడు మ‌రో వంద యూనిట్లు పెంచింది.  300 యూనిట్ల వ‌ర‌కు ఉచితంగా విద్యుత్ ను అందిస్తామ‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.  పంజాబ్‌తో పాటుగా ఉత్త‌రాఖండ్‌పై కూడా ఆప్ క‌న్నేసింది. కేజ్రీవాల్ ఉత్త‌రాఖండ్‌లో ప‌ర్య‌టించారు.  

Read: ఆ ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యంః వ్యాక్సిన్ తీసుకున్న ఆ మూడు రోజులు…

వ‌చ్చే ఏడాది ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్న త‌రుణంలో ఆప్ అనేక హామీల‌ను గుప్పించింది.  పంజాబ్‌లో ప్ర‌క‌టించిన విధంగానే ఉత్త‌రాఖండ్ లో కూడా 300 యూనిట్ల వ‌ర‌కు ఉచిత విద్యుత్‌ను ఇస్తామ‌ని తెలిపారు.  అదే విధంగా, పాత బిల్లుల బ‌కాయిల‌ను కూడా మాఫీ చేస్తామ‌ని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు  అధికారంలోకి వ‌స్తే ఉత్త‌రాఖండ్‌లో రైతుల‌కు ఉచితంగా విద్యుత్ స‌ర‌ఫ‌రా చేస్తామ‌ని తెలిపారు.  అటు గుజ‌రాత్ విష‌యంలోనూ ఆప్ ఇదేవిధ‌మైన ప్ర‌క‌ట‌న చేసేందుకు సిద్ధంగా ఉన్న‌ది.  ఢిల్లీలో 200 యూనిట్ల వ‌ర‌కు గృహ అవ‌స‌రాల‌కు విద్యుత్‌ను ఫ్రీగా అందిస్తోంది.  ఢిల్లీలో సాధ్యమైన‌పుడు మిగ‌తా రాష్ట్రాల్లో ఎందుకు సాధ్యం కాద‌ని, తాము ఢిల్లీలో అమ‌లు చేసిన విధంగానే మిగ‌తా రాష్ట్రాల్లో కూడా అమ‌లు చేస్తామ‌ని చెబుతున్న‌ది ఆప్‌.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-