అజయ్‌ కుమార్‌ మిశ్రాను తప్పించాలి..

లఖింపుర్‌ ఖేరిలో ఘటనల మీద కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మండిపడ్డారు. బాధిత రైతు కుటుంబాలకు ప్రధాని మోడీ న్యాయం చేయాలని, ఈ కేసులో నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్‌ కుమార్‌ మిశ్రాను పదవి నుంచి తప్పించాలని, ఆయన కుమారుడిని అరెస్టు చేయాలన్నారు. రైతులకు న్యాయం చేయాలని, నిందితులకు శిక్షపడాలని ఈ దేశంలోని ప్రతి పౌరుడూ కోరుకుంటున్నారని చెప్పారు. మరోవైపు.. లఖింపుర్‌ ఖేరి ఘటనలో కేంద్ర ప్రభుత్వానికి ఆరు రోజుల డెడ్ లైన్ విధించారు బీకేయూ జాతీయ ప్రతినిధి రాకేశ్‌ తికాయత్‌. ఆలోగా నిందితులపై చర్యలు తీసుకోకపోతే, మరో ఉద్యమాన్ని చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. రైతులపై ప్రమాదం చేసిన వారిని నరమాంస భక్షుకులని మండిపడ్డారు. కేంద్ర మంత్రి మండలి నుంచి అజయ్‌ మిశ్రను తొలగించాలని మోడీకి విజ్ఞప్తి చేశారు.

-Advertisement-అజయ్‌ కుమార్‌ మిశ్రాను తప్పించాలి..

Related Articles

Latest Articles