ఆంక్ష‌లు ఎత్తివేసే ఆలోచ‌న‌లో ఢిల్లీ ప్ర‌భుత్వం…

ఢిల్లీలో క‌రోనా ఉధృతి కొన‌సాగుతోంది.  క‌రోనా క‌ట్ట‌డికి ఢిల్లీ స‌ర్కార్ నైట్ క‌ర్ఫ్యూ, వీకెండ్ క‌ర్ఫ్యూల‌ను అమ‌లు చేస్తున్న‌ది.  ఈ క‌ర్ఫ్యూల వ‌ల‌న కొంత వ‌ర‌కు ఉప‌యోగం ఉన్న‌ట్టు క‌నిపిస్తున్న‌ది.  వీకెండ్ క‌ర్ఫ్యూ త‌రువాత కొంత‌మేర క‌రోనా ఉధృతి త‌గ్గింది.  అయితే, ఈ జ‌న‌వ‌రిలోనే క‌రోనా పీక్స్ ద‌శ‌కు చేరుకునే అవ‌కాశం ఉంద‌ని, క‌రోనా కేసులు రెండు రోజులు వ‌ర‌స‌గా త‌గ్గితే ఆంక్ష‌ల‌ను ఎత్తి వేస్తామ‌ని ఢిల్లీ ఆరోగ్య‌శాఖ మంత్రి స‌త్యేంద్ర జైన్ స్ప‌ష్టం చేశారు.  కేసులు త‌గ్గుముఖం ప‌డితే ప్ర‌స్తుతం అమ‌లు చేస్తున్న ఆంక్ష‌ల్లో వేటిని ఉప‌సంహ‌రించుకుంటారు అన్న దానిపై ఇంకా నిర్ధార‌ణ‌కు రాలేద‌ని తెల‌పారు.  అయితే, కేసులు పెరుగుతున్నా ఆసుప‌త్రుల్లో చేరేవారి సంఖ్య త‌క్కువ‌గానే ఉంద‌ని, ల‌క్ష‌ణాలు త‌క్కువ‌గానే ఉన్నాయ‌ని, భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని అన్నారు. ఈరోజు 25 వేల వ‌ర‌కు కేసులు న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని ఢిల్లీ ఆరోగ్య‌శాఖ మంత్రి స్ప‌ష్టం చేశారు.  ముంబైన‌గ‌రంలో కేసులు త‌గ్గుతున్నాయ‌ని, ఆదే విధంగా ఢిల్లీలో కూడా త‌గ్గే అవ‌కాశం ఉంటుంద‌ని ఆరోగ్య‌శాఖ మంత్రి పేర్కొన్నారు.  

Read: స్పెష‌ల్ క్వారంటైన్‌: పాజిటివ్ వ‌స్తే… ఆ బాక్సుల్లో ఉండాల్సిందే…

Related Articles

Latest Articles