ఐపీఎల్ 2021 : ముంబై కి షాక్… ఢిల్లీదే విజయం

ఐపీఎల్ 2021 లో ఈరోజు మొదటి మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్-ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బయటింగ్ కు వచ్చిన ముంబై జట్టు ఢిల్లీ బలమైన బౌలింగ్ ముందు నిలవలేదు. వచ్చిన వారు వచ్చినట్లు పెవిలియన్ బాట పట్టారు. సూర్య కుమార్ యాదవ్ ఒక్కడే 33 పరుగులు చేయడంతో ముంబై జట్టు నిర్ణిత ఓవర్లలో 129 పరుగులు చేసి 8 వికెట్లు కోల్పోయింది. ఇక ఆ తర్వాత 130 పరుగుల టార్గెట్ తో వచ్చిన ఢిల్లీకి మంచి ఆరంభం లభించలేదు. ఓపెనర్లు ధావన్, షా తో పాటుగా స్మిత్ కూడా సింగిల్ డిజిట్ కే పెవిలియన్ చేరుకున్నారు. ఆ తర్వాత పంత్, అయ్యర్ తో కలిసి స్కోర్ బోర్డును ముందుకు నడిపించే ప్రయత్నంలో ఔట్ అయ్యాడు. కానీ లక్ష్యం చిన్నది కావడంతో మ్యాచ్ మొదటి నుండి ఢిల్లీ వైపే ఉంది. అయితే అయ్యర్ (33) చివరి వరకు ఔట్ కాకుండా ఉండి అశ్విన్ (20) సహాయంతో జట్టుకు విజయాన్ని అందించాడు. దాంతో ఈ ఐపీఎల్ లో 18 పాయింట్లతో చెన్నై తర్వాత ప్లే ఆఫ్ కు చేరుకున్న రెండో జట్టుగా ఢిల్లీ నిలిచింది.

-Advertisement-ఐపీఎల్ 2021 : ముంబై కి షాక్… ఢిల్లీదే విజయం

Related Articles

Latest Articles