ఐపీఎల్ 2021 : ముగిసిన ముంబై ఇన్నింగ్స్…

ఐపీఎల్ 2021 లో ఈరోజు ముంబై ఇండియన్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అందులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు వచ్చిన ముంబై జట్టుకు ఢిల్లీ బౌలర్లు షాక్ ఇచ్చారు. మొదట ఓపెనర్లను తక్కువ స్కోర్ కే కట్టడి చేసిన తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్స్ ను వచ్చినట్లు పెవిలియన్ కు పంపించారు. ఎవరిని క్రీజులో కుదురుకోనివ్వలేదు. ముంబై జట్టులో సూర్య కుమార్ యాదవ్ చేసిన 33 పరుగులే అత్యధిక స్కోర్. అయితే వరుస వికెట్లు పడుతుండటంతో ముంబై 8 వికెట్లు కోల్పోయి 129 పరుగులకే పరిమితమైంది. ఇక ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్, ఆవేశ ఖాన్ మూడేసి వికెట్లు తీయగా అన్రిచ్ నోర్జే, అశ్విన్ ఒక్కో వికెట్ తీశారు. ఇక ఈ మ్యాచ్ లో గెలవాలంటే ఢిల్లీ 130 పరుగులు చేస్తే చాలు. అయితే మ్యాచ్ జరుగుతున్న పిచ్ బౌలింగ్ కు సహకరిస్తుండటంతో వారికీ ఈ లక్ష్యం కొంత కష్టమే అని చెప్పాలి. చుడాలిమరి ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనేది.

-Advertisement-ఐపీఎల్ 2021 : ముగిసిన ముంబై ఇన్నింగ్స్...

Related Articles

Latest Articles