కంగనా రనౌత్‌కు ఢిల్లీ అసెంబ్లీ సమన్లు

సిక్కులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు ఢిల్లీ అసెంబ్లీ ప్యానెల్ కమిటీ సమన్లు జారీ చేసింది. ఆప్ నేత రాఘవ చద్దా ప్యానెల్ ముందు డిసెంబర్ 6న హాజరుకావాలని ఆదేశించింది. కంగనా చేసిన వ్యాఖ్యలతో సిక్కుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఢిల్లీ అసెంబ్లీ ప్యానెల్ కమిటీ ఆరోపించింది.

Read Also: ‘అఖండ’ ప్లాన్ రివర్స్… బాలయ్యే కారణం అంటున్న నిర్మాత

ఇటీవల సాగు చట్టాలను కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో రైతులు సంతోషం వ్యక్తం చేయగా… రైతులను ఉద్దేశిస్తూ ఈనెల 20న కంగనా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్టు పెట్టడం వివాదానికి కారణమైంది. రైతుల ఉద్యమాన్ని ఖలీస్థానీ ఉద్యమంతో పోల్చడం… సిక్కులను ఉగ్రవాదులతో పోల్చడం తీవ్ర దుమారం రేపింది. దీంతో ఢిల్లీ గురుద్వార్ మేనేజ్‌మెంట్ కమిటీ నాయకులు కంగనాపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే తనపై ఎఫ్ఐఆర్ నమోదైందని తెలుసుకున్న కంగనా… మరోసారి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తనదైన శైలిలో పోస్ట్ చేశారు. తనను అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తే తన మూడ్ ఇలా ఉంటుందంటూ… వైన్ గ్లాస్ చేతిలో పట్టుకున్న ఉన్న పాత ఫోటోను పోస్ట్ చేయడంతో నెటిజన్లు ఆమెపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు.

Related Articles

Latest Articles