‘రోబో’తో బాలీవుడ్ బేబీ మరోసారి రొమాన్స్!

‘రోబో’తో మరోసారి బాలీవుడ్ బేబీ రొమాన్స్ చేయబోతోందట! సూపర్ స్టార్ రజనీకాంత్ నెక్ట్స్ మూవీలో బీ-టౌన్ నంబర్ వన్ బ్యూటీ దీపికా పదుకొణే అనే టాక్ ఇప్పుడు బాలీవుడ్, కోలీవుడ్ ని ఎగ్జైట్ చేస్తోంది. నిజానికి రజనీతో దీపిక గతంలోనే కలసి పని చేసింది. ‘కొచ్చాడయన్’ సినిమాలో టాల్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ తలైవా సరసన మెరిసంది. కానీ, అది మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో చేశారు. రాబోయే చిత్రం మాత్రం రెగ్యులర్ ఫార్మాట్ లో ఉంటుందట. రజనీకాంత్ సినిమాలో ఉండే అన్ని కమర్షియల్ హంగులు ఈ సినిమాలో ఉంటాయని సమాచారం.

ప్రస్తుతం ‘అన్నాత్తే’ సినిమా కోసం కోల్ కతాలో షూటింగ్ జరుపుతోన్న రజనీకాంత్ దీపవళి వేళ జనం ముందుకు రాబోతున్నాడు. డైరెక్టర్ శివ రూపొందిస్తోన్న మాస్ ఎంటర్టైనర్ లో కీర్తి సురేశ్, నయనతార, ఖుష్బు, మీనా లాంటి వారంతా నటిస్తుండటం విశేషం. అయితే, ‘అన్నాత్తే’ పూర్తి కాగానే సూపర్ స్టార్ ‘ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్’ బ్యానర్ పై సినిమా చేయనున్నాడు. దేసింగు పెరియాస్వామి డైరెక్టర్ గా వ్యవహరిస్తాడు. ఈ సినిమా కోసమే ప్రస్తుతం ఫిల్మ్ మేకర్స్ దీపికతో చర్చలు జరుపుతున్నారట. డీపీ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా మాత్రం సమాచారం లేదు.

Read Also : చిక్కుల్లో పడ్డ ప్రియమణి… పెళ్ళి వివాదం!

బాలీవుడ్ లో ఫుల్ జోష్ తో దూసుకుపోతోన్న దీపిక చాలా భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ చేస్తోంది. తరువాత హృతిక్ రోషన్ ‘ఫైటర్’ చేయాల్సి ఉంది. ప్రభాస్ తో నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లో దీపికనే హీరోయిన్. మరి ఇన్ని భారీ ప్రాజెక్ట్స్ నడుమ రజనీకాంత్ స్టారర్ కి కూడా సై అంటుందా? తెలియాలంటే… మనం మరికొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-