పి.వి.సింధు బయోపిక్ లో దీపిక!?

ఇటీవల తన రెండో ఒలంపిక్ పతకంతో రికార్డ్ క్రియేట్ చేసింది తెలుగమ్మాయి పి.వి. సింధు. గతంలో సింధు బయోపిక్ పలుమార్లు చర్చలోకి వచ్చింది. స్వయంగా పి.వి. సింధు తన బయోపిక్ లో నటించటానికి దీపికా పడుకొనే అయితే బాగుంటుందని కూడా చెప్పింది. ఇప్పుడు సింధు కోరిక నెరవేరబోతోంది. ఊహించినట్లుగానే దీపికా పదుకొనే సింధు పాత్రను పోషించటానికి రెడీ అవుతోంది. అంతే కాదు ఈ సినిమా దీపికనే స్వయంగా నిర్మించబోతోందట. ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. బాడ్మింటన్ లో నేషనల్ లెవల్ ఛాంపియన్ షిప్ లో ఆడిన అనుభవం ఉంది దీపికకు.

Read Also : చిన్నారిపై హత్యాచారం… మంచు మనోజ్ పరామర్శ

నటిగా మారిన తర్వాత ఆటకు దూరమైనప్పటికీ ఇప్పుడు సింధు బయోపిక్ కోసం మరోసారి బ్యాట్ చేతపట్టబోతోంది దీపిక. ఇక దీపిక తన సొంత నిర్మాణ సంస్థ కెఎ ఎంటర్ టైన్ మెంట్ ను ప్రారంభించి తొలియత్నంగా ‘ఛపాక్’ సినిమా తీసింది. ఇప్పుడు సింధు బయోపిక్ కూడా అదే బ్యానర్‌లో నిర్మించనుంది. ఈ బయోపిక్ హక్కుల కోసం సింధుకి భారీ స్థాయిలో ముట్టచెప్పినట్లు సమాచారం. మరి సింధుగా దీపిక ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.

Related Articles

Latest Articles

-Advertisement-