దీపికా పదుకొనె హాలీవుడ్ రీఎంట్రీ… నాలుగేళ్ళ తరువాత…!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే హాలీవుడ్‌ లో మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. తాజాగా ఆమె ఎస్టిఎక్స్ ఫిల్మ్స్, టెంపుల్ హిల్ బ్యానర్ లపై రూపొందనున్న క్రాస్ కల్చరల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ కు సంతకం చేసినట్టు సమాచారం. ఈ సినిమాలో ఆమె నటించడమే కాకుండా సహా నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది. నాలుగున్నర సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఆమె హాలీవుడ్‌కి తిరిగి వెళ్తోంది.

Read Also : ఎన్టీఆర్ షోకు అతిథిగా రాజమౌళి ?

హాలీవుడ్ హీరో విన్ డీజిల్ ‘xXx : రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్’లో చివరిసారిగా కన్పించింది. తాజా సమాచారం ప్రకారం ఆమె క్రాస్ కల్చరల్ రొమాంటిక్ కామెడీ మూవీకి సైన్ చేసింది. దీనిని ఎరోస్ ఎస్టిఎక్స్ గ్లోబల్ కార్పొరేషన్స్ విభాగం ఎస్టిఎక్స్ ఫిల్మ్స్ రూపొందించనుంది. ఈ ప్రాజెక్ట్‌ను ఐజాక్ క్లాస్నర్ పర్యవేక్షిస్తున్నారు. ఇదొక సాంస్కృతిక కథ అని, దీపికా పదుకొనే చుట్టూ కథ కేంద్రీకృతమై ఉంటుందని, న్యూయార్క్, ఇండియాలలో ఈ సినిమాను చిత్రీకరిస్తారని తెలుస్తోంది.

2012లో “ఛపాక్” అనే సినిమాతో దీపికా పదుకొనే నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. మరోవైపు ఆమె నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రాబోతున్న సైంటిఫిక్ డ్రామా “ప్రాజెక్ట్ కే”లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో స్క్రీన్ స్పేస్‌ను పంచుకుంటుంది. శకున్ బాత్రా నెక్స్ట్ మూవీతో పాటు “ఫైటర్” అంటూ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తో వర్మన్స్ చేయబోతోంది.

Related Articles

Latest Articles

-Advertisement-