కౌంట్ డౌన్ స్టార్ట్స్… షూటింగ్ కు రెడీ అవుతోన్న షారుఖ్, దీపిక…

‘పఠాన్’… బాలీవుడ్ లో మోస్ట్ అవెయిటెడ్ సినిమా. షారుఖ్ ఖాన్ భారీ గ్యాప్ తరువాత తిరిగి ఫ్యాన్స్ ముందుకు రాబోతున్నాడు. అలాగే, హిట్ పెయిర్ గా ముద్రపడ్డ కింగ్ ఖాన్, దీపిక ‘పఠాన్’లో యాక్షన్ కమ్ రొమాన్స్ చేయనున్నారు. అయితే, వారిద్దరూ ‘రా’ ఏజెంట్స్ గా కనిపించే థ్రిల్లర్ మూవీకి లాక్ డౌన్ పెద్ద అడ్డంకిగా మారింది. ముంబైలో కరోనా కల్లోలం తీవ్రంగా ఉండటంతో ‘పఠాన్’ మూవీని కొద్ది రోజులుగా ఆపేశారు. అయితే, తాజా సమాచారం ప్రకారం జూన్ 15 తరువాత మరోసారి షారుఖ్, దీపికా సెట్స్ మీదకి వెళ్లనున్నారట. అంతే కాదు, ఈ లోపు టీమ్ సభ్యులందరికీ వ్యాక్సిన్ వేయించే పనిలో ఉన్నాడట నిర్మాత ఆదిత్య చోప్రా. అంతా అనుకున్నట్టు జరిగితే వచ్చే నెల సెకండ్ హాఫ్ లో ‘పఠాన్’ తిరిగి పట్టాలెక్కుతుంది. ఇప్పటికైతే మహారాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తివేత గురించి ఏమీ చెప్పలేదు. జూన్ 15 దాకా ఆంక్షలు అమల్లో ఉంటాయి. కానీ, ఆ తరువాత సినిమా షూటింగ్స్ కి పర్మీషన్ వస్తుందని బాలీవుడ్ లో భావిస్తున్నారు. అందుకే, దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తో సహా అందరూ మరోసారి సెట్స్ మీదకు వెళ్లేందుకు ప్రస్తుతం సమాయత్తమవుతున్నారు…

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-