బరోడా జట్టు నుంచి తప్పుకున్న దీపక్ హుడా…

బరోడా ఆల్‌రౌండర్ దీపక్ హుడా, ఆ జట్టు నుంచి తప్పుకున్నాడు. తను ఇచ్చిన ఫిర్యాదుపై సరైన విచారణ చేయకుండా తనపైనే నిషేధం వేటు వేసిన బరోడా క్రికెట్ అసోసియేషన్ తరుపున ఆడలేనట్టు ప్రకటించాడు. ఇప్పటికే బరోడా క్రికెట్ అసోసియేషన్ నుంచి ఎన్‌వోసీ తెచ్చుకున్న దీపక్ హుడా, రాజస్థాన్ జట్టులో చేరబోతున్నాడని సమాచారం.దీంతో మరోసారి బరోడా జట్టుపై, బరోడా కెప్టెన్ కృనాల్ పాండ్యాపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. అయితే దీపక్ హుడా కృనాల్ పాండ్యా పైనే జట్టు యజమాన్యానానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-