సౌత్ ఆఫ్రికా జట్టులోకి మరో ఇద్దరు భారత ఆటగాళ్లు…!

ఐసీసీ ప్రపంచ కప్ తర్వాత నిన్నటివరకు న్యూజిలాండ్ జట్టుతో టీ20 సిరీస్ ఆడిన భారత జట్టు ఈ నెల 25 నుండి టెస్ట్ సిరీస్ లో తలపడుతుంది. అయితే ఈ ముగిసిన టీ20 కు జట్టును ప్రకటించే సమయంలో సౌత్ ఆఫ్రికా వెళ్లే 14 మందితో కూడిన భారత ఏ జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఆ తర్వాత ఆ జట్టులో భారత టెస్ట్ ప్లేయర్ హనుమ విహారిని కలిపింది. ఇక తాజాగా మరో ఇద్దరు ఆటగాళ్లను కూడా ఆ జట్టులో కలిపింది బీసీసీఐ. నిన్నటి వరకు న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ లో తలపడిన వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ అలాగే పేసర్ దీపక్ చాహర్ ను భారత ఏ జట్టుకు ఎంపిక చేసింది. అయితే మొదటిసారి జట్టును ప్రకటించిన సమయంలో బీసీసీఐ కేవలం ఒక్క వికెట్ కీపర్ ను మాత్రమే ఈ పర్యటనకు ఎంచుకుంది. అందుకే ఇప్పుడు మరో వికెట్ కీపర్ గా ఇషాన్ కిషన్ ను జట్టులోకి తీసుకుంది. అలాగే బౌలింగ్ విభాగంలో బలాన్ని పెంచేందుకే దీపక్ చాహర్ ను ఈ జట్టులో విలీనం చేసినట్లు తెలుస్తుంది.

Related Articles

Latest Articles