‘పుష్ప’ సక్సెస్ పార్టీ.. అందరి చూపు అతడిపైనే

పుష్ప.. అందరి లెక్కలు తేల్చేసాడు.. ఒకటి కాదు రెండు కాదు.. పాన్ ఇండియా లెవెల్ల్లో అన్ని భాషల్లోనూ పుష్ప తగ్గేదేలే అని నిరూపించాడు. అల్లు అర్జున్ – సుకుమార్ హ్యాట్రిక్ కాంబో గా వచ్చిన ఈ సినిమా 300కోట్ల క్లబ్ లో చేరబోతోంది. ఈనేపథ్యంలోనే చిత్ర బృందం డైరెక్టర్ సుకుమార్ పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీలో చిత్ర బృందం తో పాటు సుకుమార్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ హాజరయ్యారు. ఇక ఈ పార్టీలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్. పార్టీలో ప్రతి ఒక్కరు దేవి శ్రీ ప్రసాద్ పెళ్లి గురించే అడుగుతున్నారట.

42 ఏళ్ళ దేవి కరోనాకు ముందే తానూ ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని సెటిల్ అవుతాడని వార్తలు గుప్పుమన్నాయి. అయితే అవి కేవలం పుకార్లు అని మాత్రమే తెలుస్తోంది. ఇక ఏ పార్టీలో పాతికేళ్ల కుర్రాడిలా దేవి డాన్స్ స్టెప్పులు అందరిని ఆకట్టుకున్నాయి. దీంతో అందరి దృష్టి అతడి పెళ్లి మీదకు పోయింది. దేవి శ్రీ పెళ్ళెప్పుడు అంటూ దేవిని ఆడుకుంటున్నారట. మరి ఈ ఏడాది అయినా దేవి ఒక ఇంటివాడు అవుతాడేమో చూడాలి.

Related Articles

Latest Articles