పాపులర్ మ్యూజిక్ సంస్థకు “డియర్ మేఘ” ఆడియో రైట్స్

అరుణ్ ఆదిత్, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో నటించిన బ్యూటీ ఫుల్ లవ్ స్టోరీ “డియర్ మేఘ”. అర్జున్ సోమయాజులు మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. ఎ సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని నిర్మాత అర్జున్ దాస్యన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేసుకుంది. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై రూపొందిం రొమాంటిక్ ఎంటర్టైనర్ త్వరలోనే ఓటిటి ప్లాట్ ఫామ్ పై ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాతలే ప్రకటించారు.

Read Also : చెర్రీ – శంకర్ మూవీకి బుర్రా సాయిమాధవ్ డైలాగ్స్

ఇక తాజాగా ఈ సినిమా ఆడియో రైట్స్ ను పాపులర్ మ్యూజిక్ సంస్థ సొంతం చేసుకుంది. సిల్లీ మాంక్స్ “డియర్ మేఘ” ఆడియో రైట్స్ ను కొనుగోలు చేసినట్టు ప్రకటిస్తూ మేఘ, ఆదిత్ ఉన్న పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీపై క్లారిటీ రానుంది. ఈ చిత్రానికి హరి గౌరా సంగీతం అందించారు. కాగా మేఘ గతంలో నితిన్ సరసన “లై” చిత్రంలో నటించింది. కానీ ఆ చిత్రంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు మరోసారి “డియర్ మేఘ” అంటూ తన లక్ ను మరోమారు పరీక్షించుకోవడానికి సిద్ధమైంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-