డెడ్ పూల్ : మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లోకి మరో సూపర్ హీరో!

అమెరికన్ కామిక్ హీరో మూవీస్ చూసేవారికి బాగా పరిచయమున్న పాత్ర డెడ్ పూల్. ఒకప్పుడు కామిక్ బుక్స్ లో మొదలైన సూపర్ హీరో ఇప్పుడు బిగ్ స్క్రీన్ మీద కూడా బిగ్ బ్రాండ్! అయితే, డిస్నీ తమ సూపర్ హీరోస్ అందర్నీ మెల్లమెల్లగా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో ప్రవేశపెడుతూ వస్తోంది. మరి డెడ్ పూల్ సంగతేంటి? ఇంత కాలం ఈ అనుమానం ఉన్న మార్వెల్ ఫ్యాన్స్ కి తాజాగా వచ్చిన ఓ ప్రమోషనల్ వీడియో సమాధానం ఇచ్చింది…

‘ఫ్రీ గై’ పేరుతో ఓ సినిమా చేశాడు హాలీవుడ్ స్టార్ రయాన్ రెనాల్డ్స్. ఆ సినిమా ప్రచారం కోసం ఓ స్పెషల్ వీడియో చేశారు. అందులో వరల్డ్ ఫేమస్ ‘తోర్’ కూడా కనిపించాడు. అతని పక్కనే ‘డెడ్ పూల్’ ప్రత్యక్షమయ్యాడు. వారిద్దరూ ‘ఫ్రీ గై’ గురించి కామెడీగా మాట్లాడుకుంటారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే… ‘ఫ్రీ గై’లో హీరో పాత్ర చేసింది, డెడ్ పూల్ క్యారెక్టర్ చేసేది… రయాన్ రెనాల్డ్సే! అందుకే, తన ‘ఫ్రీ గై’ సినిమాకి తన ‘డెడ్ పూల్’ క్యారెక్టర్ తో పబ్లిసిటీ చేసుకున్నాడు! ఇక సూపర్ హీరో ‘తోర్’ పక్కన ‘డెడ్ పూల్’ కనిపించటంతో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో ఎంట్రీ ఖాయమైందంటున్నారు నెటిజన్స్! హాలీవుడ్ స్టార్ రయాన్ రెనాల్డ్స్ కూడా అదే కన్ ఫర్మ్ చేశాడు! ‘డీపీ ఈజ్ అఫీషియల్లీ ఇన్ ఎమ్ సీయూ!’ అంటూ సొషల్ మీడియాలో ప్రకటించాడు…

ఆగస్ట్ 13న ‘ఫ్రీ గై’ మూవీతో ప్రేక్షకుల ముందుకి వస్తోన్న రయాన్ రెనాల్డ్స్ నెక్ట్స్ ‘డెడ్ పూల్ 3’ సీక్వెల్ లో కనిపిస్తాడు. ఆ తరువాత డెడ్ పూల్ పాత్ర కూడా క్రమంగా ఇతర సూపర్ హీరోలతో కలసి మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో ప్రపంచాన్ని అలరిస్తుంది…

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-