అజయ్ దేవగణ్ కోసం ‘స్వర్గం’! రకుల్ కు స్పెషల్ ఎంట్రీ…

బాలీవుడ్ టాప్ హీరోలు ఒక్కొక్కరుగా టాప్ గేర్ లోకి వస్తున్నారు. అందరూ సెట్స్ మీదకి దూకేస్తున్నారు. సెకండ్ వేవ్ కారణంగా విధించిన లాక్ డౌన్ వల్ల నెలల తరబడి ఇంట్లోనే ఉండిపోయిన బిజీ హీరోలు ఇప్పుడు డబుల్ జోష్ తో బరిలోకి దిగుతున్నారు. అజయ్ దేవగణ్ కూడా ఒకేసారి రెండు సినిమాలపై దృష్టి పెట్టబోతున్నాడు…

Read Also: చెర్రీ – శంకర్ మూవీకి బుర్రా సాయిమాధవ్ డైలాగ్స్

లాక్ డౌన్ ఎత్తేసి షూటింగ్స్ కి పర్మీషన్ ఇవ్వటంతో ‘థాంక్ గాడ్’ అంటూ ‘మైదాన్’ చిత్రం పూర్తి చేసేస్తున్నాడు దేవగణ్. బోనీ కపూర్ నిర్మిస్తోన్న స్పోర్ట్స్ డ్రామా మూవీ లాక్ డౌన్ వల్లే కాక భారీ తుఫాన్ వల్ల కూడా నష్టాన్ని చవి చూసింది. ముంబైపై దాడి చేసిన భారీ వర్షాల కారణంగా ‘మైదాన్’ మూవీ సెట్ కొట్టుకుపోయింది. దాంతో ఆయన ప్రస్తుతం ఆ సినిమా కోసం సెట్టింగ్స్ తో పని లేని సీన్స్ పూర్తి చేస్తున్నాడు. వర్షాలు బాగా తగ్గాక మళ్లీ ముంబైలోని ఓ స్టూడియోలో ‘మైదాన్’ కోసం భారీ సెట్ పునర్ నిర్మిస్తారట!

Read Also: మద్రాస్‌ హైకోర్టులో హీరో విజయ్‌కి చుక్కెదురు

‘మైదాన్’ చిత్రం పూర్తి కావటానికి వర్షాలతో లింక్ ఉండటంతో…. అజయ్ దేవగణ్ ‘థాంక్ గాడ్’ సినిమా కానిచ్చేద్దామని డిసైడ్ అయ్యాడు. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఇంద్ర కుమార్ ఈ సినిమాని రూపొందిస్తున్నాడు. అజయ్ తో పాటూ సిద్ధార్థ్ మల్హోత్రా, రకుల్ ప్రీత్ సింగ్ కూడా సినిమాలో కనిపించబోతున్నారు. సినిమా పేరే ‘థాంక్ గాడ్’ కాబట్టి కథలో దేవుడు కూడా ఒక పాత్రేనట! అందుకే, ముంబైలోని మెహబూబ్ స్టూడియోలో దేవలోకం నిర్మించారు! ఆ హెవెన్లీ సెట్టింగ్స్ లో ప్రస్తుతం చిత్రం షూటింగ్ చేయనున్నారు. ఇన్ ఫ్యాక్ట్ ‘థాంక్ గాడ్’ సినిమా 2019లో అనౌన్స్ చేశారు. 2020లో షూట్ జరిపి, 2021లో విడుదల చేసేలా ప్లాన్ చేశారు. కానీ, కరోనా దెబ్బతో రెండేళ్లుగా వాయిదా పడుతూ వస్తోంది. చూడాలి మరి, ‘థాంక్ గాడ్’ ఇప్పుడు మొదలై ఎప్పటికి జనం ముందుకు వస్తుందో! అజయ్ దేవగణ్ తన తొలి వెబ్ సిరీస్ ‘రుద్ర’ కూడా సైమల్టేనియస్ గా పూర్తి చేస్తాడని టాక్. అది 2021 ముగిసేలోగానే డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవ్వనుంది…

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-