గ్యాలెక్సీని కాపాడే బాధ్యత నుంచీ… హాలీవుడ్ సూపర్ హీరో… వాలెంట్రీ రిటైర్మెంట్!

ఇండియాలో చాలా మంది నటులు ‘ఇక చాలు’ అనేదాకా నటిస్తూనే ఉంటారు. వీలైతే ఎంత ఏజ్ బారైనా రొమాంటిక్ హీరో వేషాలే వేసేయాలని తాపత్రయపడతారు. కానీ, హాలీవుడ్ లో కొందరు టాప్ స్టార్స్ ప్రవర్తన మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఉదాహరణకి… డేనియల్ క్రెయిగ్ ని తీసుకుంటే… ‘నో టైం టూ డై’ సినిమా తరువాత జేమ్స్ బాండ్ వేషం ధరించబోనని తేల్చేశాడు. ఆయన్ని దర్శకనిర్మాతలు ఎవ్వరూ పక్కకు తప్పుకోమని అడగలేదు. అయినా ‘సారీ ఐ కాంట్’ అనేశాడు!

హాలీవుడ్ స్టార్స్ తమకు ఏజ్ పెరిగినా, లేదా ఎక్కువ సార్లు ఒకే పాత్రలో కనిపించినా… స్వచ్ఛందంగా తప్పుకుంటూ ఉంటారు. జనం బోర్ గా ఫీలవ్వక ముందే, క్రేజ్ ఉన్నంతలోనే… ఎగ్జిట్ అయిపోతుంటారు. ఇప్పుడు అదే చేయనున్నాడు మరో క్రేజీ సూపర్ హీరో… డేవ్ బౌటిస్టా. ఇంతకీ, ఈయన ఎవరంటే మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో ఒకానొక సూపర్ హీరో! ‘గార్జియన్స్ ఆఫ్ గ్యాలెక్సీ’ సిరీస్ ఫాలో అయ్యే వారికి ‘డ్రాక్స్ ద డెస్ట్రాయర్’ ఎవరో తెలిసే ఉంటుంది. వెండితెరపై మన పాల పుంతని కాపాడే సంరక్షకుల్లో ఇతనూ ఒకడు! ఈ మాజీ డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్ ‘గార్డియన్స్ ఆఫ్ గ్యాలెక్సీ’ పార్ట్ వన్ అండ్ టూ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు!

జనాల్లో బోలెడు క్రేజ్ ఇంకా ఉన్నప్పటికీ, అక్టోబర్ లో మొదలయ్యే ‘గార్డియన్స్ 3’ సీక్వెల్ మూవీనే, తన చివరి మార్వెల్ మూవీ అంటున్నాడు బౌటిస్టా. ఇప్పటికే ‘తోర్ : లవ్ అండ్ థండర్’ సినిమా కూడా ఆయన పూర్తి చేశాడు. మిగిలింది ‘గార్డియన్స్’ సిరీస్ లో మూడో చిత్రం. అది పూర్తికాగానే ‘డ్రాక్స్’ పాత్ర నుంచీ డేవ్ బౌటిస్టా బయటకు వచ్చేస్తాడట. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ కి కూడా గుడ్ బై చెప్పేస్తాడట. ఇది ఆయన ఫ్యాన్స్ కి కొంత షాకే అయినా… నెక్ట్స్ ‘డ్రాక్స్’ క్యారెక్టర్ పరిస్థితి ఏంటి అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచీ డేవ్ బౌటిస్టా మాత్రమే వెళ్లిపోతాడా… లేదా డ్రాక్స్ క్యారెక్టర్ కూడా అంతమైపోతుందా? లెట్స్ వెయిట్…

-Advertisement-గ్యాలెక్సీని కాపాడే బాధ్యత నుంచీ… హాలీవుడ్ సూపర్ హీరో… వాలెంట్రీ రిటైర్మెంట్!

Related Articles

Latest Articles