తండ్రి వేధింపులు..అర్ధరాత్రి స్నేహితులను పిలిచి కూతురు ఏంచేసిందంటే..?

తండ్రి.. కన్నబిడ్డలకు ఆదర్శం.. హీరో. ఇంకా ఆడపిల్లలకైతే తండ్రే సర్వస్వము..కానీ, చిన్నప్పటినుంచి అల్లారుముద్దుగా పెంచాల్సిన తండ్రే వేధింపులకు గురి చేస్తే.. బయట ఎవరో ఏడిపిస్తున్నారని తండ్రికి చెప్పాల్సిన పిల్లలు తండ్రే తమపాలిట యముడిలా తయారయ్యాడని ఎవరికి చెప్పగలరు.. తాజాగా పుట్టినప్పటి నుంచి 17 ఏళ్లు వచ్చేవరకు తమను చిత్రవధకు గురిచేసిన తండ్రిపై పగపెంచుకున్న ఆ బాలిక కఠిన నిర్ణయం తీసుకొంది. ఈ చిత్రహింసలు తగ్గాలంటే తండ్రిని చంపడమే కరెక్ట్ అనుకొంది.. స్నేహితులతో, చెల్లెళ్ళతో కలిసి తండ్రిని హతమార్చింది. ఈ దారుణ ఘటన బెంగుళూరులో చోటుచేసుకొంది.

వివరాలలోకి వెళితే.. బీహార్‌కు చెందిన దీపక్ కుమార్ సింగ్ (46) అనే వ్యక్తి బెంగుళూరులోని గాంధీ కృషి విజ్ఞాన కేంద్రంలో భద్రతా విభాగంలో పని చేస్తున్నాడు. అతనికి ముగ్గురు కుమార్తెలు.. భార్య మృతిచెందడంతో పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. భార్య లేకపోవడంతో కూతుళ్లను రోజు చిత్రహింసలకు గురిచేయడం మొదలుపెట్టాడు.. చెప్పుకోలేని విధంగా వారిని చిత్రవధ చేస్తూ రోజు నరకం చూపించేవాడు. ఇక ఈ బాధలను 17 ఏళ్లుగా మోస్తున్న పెద్ద కూతురు తండ్రిపై కక్ష పెంచుకొంది. ఈ బాధలు తప్పాలంటే తండ్రిని చంపాలని నిర్ణయించుకొంది. ఈ విషయాన్ని తన స్నేహితులకు తెలిపి ప్లాన్ వేసింది.

ఆదివారం అర్ధరాత్రి ముగ్గురు స్నేహితులతో ఇంటికి వచ్చిన బాలిక నిద్రిస్తున్న తండ్రిపై మారణాయుధాలతో దాడి చేసింది. ఈ దాడిలో మరో ఇద్దరు కూతుళ్లు కూడా పాల్గొనడం గమనార్హం. మొత్తం కలిసి దీపక్ కుమార్ ని మృతిచెందేవరకు పొడిచి పొడిచి చంపారు. అనంతరం బాలిక స్నేహితులతో కలిసి పరారయ్యింది. సోమవారం సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Related Articles

Latest Articles