టీఆర్ఎస్ నాయకులకు అల్జిమర్ వ్యాధి..

ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ తెలంగాణ సర్కార్ పై ఫైర్ అయ్యారు. బంగారు తెలంగాణలో భూముల అమ్మకం ఏంటీ.. కేసీఆర్..? ఆదాయం కోసం నిన్న సిగ్గు లేకుండా మీటింగ్ పెట్టారని మండిపడ్డారు. ఎకానమీ పెంపుపై నిపుణులతో సమావేశం పెట్టాలని..బసవన్నలతో కాదని నిప్పులు చెరిగారు. టీఆరెస్ సర్కార్ తప్పుడు పనులు చేస్తుందని..ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ.. కేసీఆర్ పాలన సాగిస్తున్నాడని మండిపడ్డారు. ఆర్టికల్ 20 ప్రకారం గవర్నమెంట్ ట్రస్టీగానే పనిచేయాలని.. నన్ను తిట్టిన, చంపిన ప్రజల పక్షాన పోరాటం చేస్తా అని స్పష్టం చేశారు.

టీఆరెస్ నాయకులకు అల్జిమర్ వ్యాధి వచ్చిందని.. ఆదాయ సమీకరణ కోసం.. భూములు అమ్మోద్దని.. 2012 లో కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్ జీవో: 61 విడుదల చేసిందని తెలిపారు. ఈ జీవోను అమలు చేస్తామని 2015లో అంగీకరించిన టీఆరెస్ సర్కార్.. ఇప్పుడు ఎందుకు యూటర్న్ తీసుకుందన్నారు. రాష్ట్రంలో దోపిడీ, అరాచక పాలన సాగుతుందని… ఎవరి జాగీరని భూములను అమ్ముతున్నారని మండిపడ్డారు. 15, 20 వేల కోట్లకోసం కాదు.. ఇదో పెద్ద స్కామ్.. దాన్ని అడ్డుకొని తీరుతామని హెచ్చరించారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-