బిజేపిలోకి ఈటల : కాంగ్రెస్ సంచలన వ్యాఖ్యలు

ఈటల బిజేపిలో చేరడంపై కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తోడేళ్ల దాడిని తప్పించుకోవడానికే ఈటల ఢిల్లీ వెళ్లారని దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. ఈటల పై పోలీసు, రెవెన్యూ అధికారులతో ఒత్తిడి పెంచారని.. ఒత్తిడి తప్పించుకోవడానికి ఈటల ప్రయత్నం చేస్తున్నారని వెల్లడించారు. టీఆర్ఎస్ ఆధిపత్యం కోసం ఈటలతో పాటు.. ఆయన భార్య జమున, కొడుకు, కోడలు పై కేసులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ ఫక్తు రాజకీయ పార్టీకాదు, ఫక్తు ఫాల్తూ పార్టీగా మారిందని పేర్కొన్నారు దాసోజు. తెలంగాణ ఉద్యమకారులపై దాడి చేసినవాళ్ళు మంత్రులయ్యారని ఆయన మండిపడ్డారు. టీఆర్ఎస్ నుంచి తప్పించుకోవడానికి ఈటల బిజేపి వైపు చూస్తున్నారని.. దాసోజు తెలిపారు. కాగా ఇవాళ సాయంత్రం ఢిల్లీలో జెపి నడ్డాతో ఈటల సమావేశం కానున్న సంగతి తెలిసిందే.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-