పంటకొనే ధ్యాసే ప్రభుత్వానికి లేదు: దాసోజు శ్రవణ్‌

ఖరీఫ్ పంట రోడ్డు మీద ఉంటే పంట కొనే ధ్యాస ఈ ప్రభుత్వానికి లేదని నారాయణపేట కలెక్టర్ కార్యాలయం ఆవరణలో కాంగ్రెస్‌ నేత దాసోజు శ్రావణ్ ప్రభుత్వాన్ని విమర్శిస్తు వ్యాఖ్యలు చేశారు. మా పంట కొనండి అని రైతులు ఎంత మొత్తుకున్నా ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వానపడ్డట్టు కూడా లేదని ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌ బీజేపీలు రెండు కుమ్మకై నాటకాలు ఆడుతున్నారన్నారు. కేంద్రం ఖరీఫ్‌లో పండించింది మేము తీసుకుంటామని చెప్పిన, మనం పండించిన పంటను ఎందుకు కొనరో టీఆర్‌ఎస్‌ నాయకులను నిలదీయాలని ఆయన అన్నారు.

ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు కొనమని చెబుతున్న టీఆర్‌ఎస్‌ నాయకులకు కర్రు కాల్చి వాత పెట్టాలని వ్యాఖ్యానించారు శ్రవణ్.. నారాయణపేట కలెక్టర్ కార్యాలయం బ్రిటిష్ రాజ్యంలో ఉన్నట్టు ఉంది ఇక్కడ ఎక్కడ చూసినా పోలీసులు కనిపిస్తున్నారు తప్ప అధికారులు కన్పించడం లేదని ఆయన అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల పంటను కొనకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని దాసోజు శ్రవణ్‌ హెచ్చరించారు.

Related Articles

Latest Articles