ఉత్కంఠ రేపుతున్న దర్శి … టీడీపీ జెండా ఎగిరేనా?

ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీకి ఎన్నికలు ముగిసినా ఇంకా ఉత్కంఠ తీరడంలేదు. దర్శి నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక ఆసక్తిగా మారుతోంది. ఇక్కడ ఎన్నికల్లో పూర్తి ఆధిక్యతను కనబరిచిన టీడీపీ చైర్మన్ పీఠం దక్కించుకుంటుందా? టీడీపీ కౌన్సిలర్స్ లో చీలిక కు వైసీపీ ప్రయత్నం చేస్తోందనే వార్తలు వస్తున్నాయి. చైర్మన్ ఎన్నిక జరగబోయే సోమవారం ఏం జరగబోతోంది?

రెండుదఫాలుగా జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో టీడీపీ తాడిపత్రి, కొండపల్లి, దర్శిలో ఆధిక్యతను సాధించింది. దర్శిలో మొత్తం 20 వార్డులకు ఎన్నికలు జరిగాయి. అందులో టీడీపీ 13, వైసీపీ 7 చోట్ల గెలిచింది. తీవ్ర పోరులో టీడీపీ తన ఆధిక్యతను కనబరిచింది. అనూహ్యంగా గెలిచిన దర్శి నగర పంచాయతీని కాపాడుకోవడానికి టీడీపీ కట్టుదిట్టంగా ప్రయత్నిస్తోంది.

ఫలితాలు వెలువడిన వెంటనే తన కౌన్సిలర్లతో రహస్య ప్రాంతంలో క్యాంప్ పెట్టింది. మరోవైపు టీడీపీ సభ్యుల్లో చీలిక తెచ్చేందుకు స్థానిక వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. టీడీపీ క్యాంప్ లో ఉన్న కౌన్సిలర్ల బంధువులు, మిత్రులు ద్వారా రాయబారాలు, హార్స్ ట్రేడింగ్‌ సాగిస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. నిజంగానే ఇలా జరిగితే… ఎన్నిక ఆసక్తిగానే ఉంటుంది. దీనితో అందరి చూపు దర్శి వైపు మళ్ళింది.

Related Articles

Latest Articles