ఆహాలో రాబోతున్న కన్నడ ‘హీరో’!

కన్నడ దర్శకుడు రిషబ్ శెట్టి హీరోగా నటించిన సినిమా ‘హీరో’. భరత్ రాజ్ దర్శకత్వంలో రిషబ్ శెట్టి నిర్మించిన ఈ యాక్షన్ కామెడీ మూవీ ఈ యేడాది మార్చి 5న కన్నడలో విడుదలై మంచి విజయం సాధించింది. టీవీ నటి గణవి లక్షణ్ నాయికగా నటించిన ‘హీరో’లో ప్రతినాయకుడి పాత్రను ప్రమోద్ శెట్టి పోషించాడు. ‘ఉగ్రం’ మంజు, అనిరుధ్ మహేశ్, ప్రదీప్ శెట్టి ఇతర ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి అజనీశ్ లోక్ నాధ్ సంగీతం అందించాడు. గత యేడాది కొవిడ్ సమయంలో చిక్ మంగళూర్ లోని కాఫీ ఎస్టేట్స్ లో ఈ మూవీ షూటింగ్ ను సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేయడం విశేషం.

Read Also : అల్లుడిని వెనక్కు నెట్టిన పవర్ స్టార్

రావణలంక ను తలపించే ఓ ప్రాంతంలోకి హీరో అడుగుపెట్టి, లంకాదహనం ఎలా చేశాడన్నదే ఈ చిత్ర కథ. కన్నడ చిత్రాలు ‘రిక్కి’, ‘కిరిక్ పార్టీ’లతో రిషబ్ శెట్టికి దర్శకుడిగా మంచి గుర్తింపు లభించింది. ప్రస్తుతం దర్శకత్వంతో పాటు నటన మీద కూడా రిషబ్ దృష్టి పెట్టాడు, ‘రుద్రప్రయాగ్’ అనే సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. రిషబ్ శెట్టి ‘హీరో’ చిత్రాన్ని తెలుగులోనూ అదే పేరుతోనే డబ్ చేసి, ఈ నెల 24న ఆహా లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి తెలుగు ట్రైలర్ ఇవాళ విడుదలైంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-