టీఆర్పీ రేసులో సీరియల్స్ ని బీట్ చేయలేకపోతోన్న డ్యాన్స్ అండ్ మ్యూజిక్ షోస్!

దేశంలోని మిగతా అన్నీ భాషలతో పోలిస్తే హిందీ ఛానల్స్ ఎక్కువే. న్యూస్ మాత్రమే కాదు ఎంటర్టైన్మెంట్ విభాగంలోనూ బోలెడు ఛానల్స్ ఉన్నాయి. మరి, కోట్లాది మందిని కట్టిపడేస్తోన్న సీరియల్స్ అండ్ షోస్ లో జాతీయ స్థాయిలో ఎవరు నంబర్ వన్? ఈ సంగతి ఓసారి తెలియాలంటే తాజా టీఆర్పీల లిస్ట్ చూడాల్సిందే…
2021వ సంవత్సరంలోని 20వ వారం టీఆర్పీలు పరిశీలిస్తే… మరొక్కసారి ‘తారక్ మెహతా కా ఉల్టా ఛష్మా’ సీరియల్ దే అగ్ర స్థానం! ప్రజెంట్ 20త్ వీక్ లోనే కాదు గతంలోనూ ఈ సీరియల్ టాప్ పొజీషన్ లో కంటిన్యూ అవుతూ వస్తోంది. ‘తారక్ మెహతా కా ఉల్టా ఛష్మా’ 13 ఏళ్ల నుంచీ ప్రసారం అవుతోంది. దాదాపుగా ఎప్పుడూ టాప్ టీఆర్పీస్ ఈ సీరియల్ కే దక్కుతూ వస్తున్నాయి!
లెటెస్ట్ లిస్టులో సెకండ్ పొజీషన్ ‘అనుపమా’కు దక్కింది. ఇది కూడా సీరియలే! మూడో నంబర్ మాత్రం రియాల్టీ షో కైవసం చేసుకుంది. ‘ఇండియన్ ఐడల్ 12’ టాప్ థర్డ్ ర్యాంకింగ్ పొందింది. ఈ షో విషయంలో తాజాగా అనేక వివాదాలు చెలరేగటం కూడా కలిసొచ్చిందని చెప్పాలి. అయితే, మళ్లీ నాలుగు, ఐదు స్థానాల్ని సీరియల్సే ఆక్రమించాయి. ‘యే రిష్తా క్యా కెహలాతా హై, గుమ్ హై కిస్కే ప్యార్ మే’ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ పొజీషన్ లో ఉన్నాయి.
డ్యాన్స్ షో ‘సూపర్ డ్యాన్సర్ చాప్టర్ 4’, సీరియల్ ‘బారిష్టర్ బాబు’, వన్స్ ఎగైన్ డ్యాన్స్ రియాల్టీ షో ‘డ్యాన్స్ దివానే 3’, సీరియల్స్ ‘వాగ్లే కీ దునియా, శక్తి’ సిక్స్ త్ టూ టెన్త్ పొజీషన్స్ ఆక్యుపై చేశాయి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-