అక్టోబ‌ర్ 7, గురువారం దిన‌ఫ‌లాలు

మేషం:- ఉద్యోగస్తుల తొందరపాటు నిర్ణయాల సమస్యలు ఎదుర్కొంటారు. కోర్టు వ్యవహారాలు వాయిదాపడతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ వాక్‌చాతుర్యానికి మంచి తనానికి గుర్తింపు లభిస్తుంది. రాజకీయాలలో వారికి మెళకువ అవసరం. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి.

వృషభం:- స్త్రీలకు బంధువులలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఖర్చులు పెరిగినా ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. వృత్తి, ఉద్యోగస్తులకు కలిసి రాగలదు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి అనుకున్నది సాధిస్తారు. నిత్యావసర వస్తు వ్యాపారులకు, రేషన్ డీలర్లకు చికాకులు తప్పవు.

మిథునం:- ఆర్థిక సమస్యలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. ఆత్మీయులను కలుసుకుంటారు. దూర ప్రయాణాల్లో వస్తువులపట్ల మెళుకువ అవసరం. సన్నిహితుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. స్త్రీలకు వాదానం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. పోస్టల్, ఎసి ఏజెంట్లకు ఆర్థికంగా పొగుంటుంది.

కర్కాటకం:- ప్రైవేటు సంస్థల్లో వారు ఓర్పు, అంకిత భావంతో పనిచేయవలసి వుంటుంది. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. రాజకీయాల్లో వారికి విరోధులు వేసే ఎత్తులు ఎంతో ఆందోళన కలిగిస్తాయి. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తాయి.

సింహం:- వస్త్ర బంగారం, వెండి, వ్యాపారులకు పురోభివృద్ధి. మీడియా రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు పదోన్నతి, కోరుకున్న చోటుకు బదిలీ వంటి శుభపరిణామాలు ఉంటాయి. కంపెనీ సమావేశాలలో మీకు గతానుభవం ఉపయోగపడుతుంది.

కన్య:- ఆర్థిక విషయాలలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. పరస్త్రీలతో అధికంగా సంభాషించడం మంచిదికాదు. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళుకువ చాలా అవసరం. విజ్ఞతతో వ్యవహరించి రుణదాతలను సమాధానపరుస్తారు. సంఘంలో ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు మీ పురోభిద్ధికి తోడ్పడతాయి.

తుల:- టెక్నికల్, కంప్యూటర్ రంగాలలో వారికి సంతృప్తి కానరాగలదు. విదేశాల్లోని అయిన వారి క్షేమ సమాచారాలు సంతృప్తినిస్తాయి. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. శస్త్ర చికిత్సలు చేయునపుడు వైద్యులకు ఏకాగ్రత అవసరం. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

వృశ్చికం: కొబ్బరి, పండ్ల పూల, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి. బంధువులను కలుసుకుంటారు. ఉపాధ్యాయులకు స్థానచలన మార్పిడికై చేయుయత్నంలో కొన్ని ఆటంకాలు ఎదుర్కోక తప్పదు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు.

ధనస్సు:- స్త్రీలు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. విందులలో పరిమితి పాటించడం చాలా అవసరం. విలువైన కానుకలందించి ప్రముఖులను ఆకట్టుకుంటారు. మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఉద్యోగస్తులకు పైఅధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. చిన్ననాటి వ్యక్తులను కలుసుకుంటారు.

మకరం:- రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. బంధు మిత్రులతో కలసి ఆలయాలను సందర్శిస్తారు. బంగారు, వెండి లోహ రంగాలలో వారికి మందకొడిగా వుండగలదు. స్త్రీలు తెలివి తక్కువగా వ్యవహరించడం వల్ల చేపట్టిన పనులు కొంత ముందు వెనుకలుగానైనా జయం చేకూరగలదు.

కుంభం:- పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల పట్ల అప్రమత్తత అవసరం. స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. రిప్రజెంటేటివ్‌లు తమ టార్గెట్లను అతికష్టం మీద ఆలస్యంగానైనా పూర్తిచేస్తారు.

మీనం:- స్త్రీలు షాపింగ్ కోసం ధనం ఖర్చు చేస్తారు. సంఘంలో మంచి గుర్తింపు, గౌరవం లభిస్తుంది. రాజకీయకులతో సంభాషించేటపుడు ఓర్పు, సంయమనం పాటించండి. విద్యార్థులు ప్రేమ వ్యవహారాల్లో పెద్దల నుంచి విమర్శలను ఎదుర్కొంటారు. మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు.

-Advertisement-అక్టోబ‌ర్ 7, గురువారం దిన‌ఫ‌లాలు

Related Articles

Latest Articles