అక్టోబ‌ర్ 27, బుధ‌వారం దిన‌ఫ‌లాలు

మేషం :- వ్యాపారాల్లో నష్టాలను కొంతమేరకు అధిగమిస్తారు. అవగాహనం లేని విషయాలకు దూరంగా ఉండటం మంచిది. పెద్దల ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు అవసరం. స్త్రీలకు మొహమ్మాటాలు, ఒత్తిళ్లు అధికమవుతాడు. ఏ విషయంలోనూ ఒంటెత్తు పోకడ మంచిదికాదు. తరచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు.

వృషభం :– మాట్లాడలేనిచోట వహించడం మంచిది. గతంతో పోల్చుకుంటే ప్రస్తుత ఆర్థికస్థితి కొంత మెరుగనిపిస్తుంది. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. ప్రతికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన అవసరం.

మిథునం :- వృత్తి వ్యాపారాలు, ఉపాధి పథకాల్లో రాణిస్తారు. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. ఏ విషయంలోనూ హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి. భాగస్వామిక చర్చల్లో కొత్త విషయాలు చోటుచేసుకుంటాయి. నిరుద్యోగులకు ప్రకటనల పట్ల అవగాహన ప్రధానం.

కర్కాటకం :- ఉద్యోగ విరమణ చేసిన వారికి రావలసిన బెనిఫిట్స్ ఆలస్యంగా అందుతాయి. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. కావలసిన వ్యక్తుల కలయిక అనుకూలించదు. కొబ్బరి, పండ్లు, పూలు, కూరగాయల వ్యాపారులకు లాభసాటిగా సాగుతాయి. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది.

సింహం :- వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. రహస్య విరోధులు అధికం కావడంవల్ల రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పుదు. మీ భావాలు, అభిప్రాయాలకు ఆమోదం లభిస్తుంది. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది.

కన్య :- ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కొబ్బరి పండ్ల, పూల, కూరగాయల వ్యాపారాలు లాభదాయకం. స్త్రీలకు బంధువర్గాల నుండి ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. ఇతరులకు పెద్ద మొత్తంలో ధన సహాయం చేసే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి.

తుల :- బ్యాంకుల్లో మీపనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రైవేటు సంస్థలలోని వారు మార్పులు యత్నాలు ఆటంకాలు తప్పవు. కొన్ని సంఘటనలు మనస్థిమితం లేకుండా చేస్తాయి. ఉద్యోగస్తులకు పర్యటనలు, ఒత్తిడి, విశ్రాంతి లోపం.

వృశ్చికం :- ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. ప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది. కోర్టు వ్యవహారాలు విచారణకు వస్తాయి. ప్రైవేటు సంస్థల్లో వారికి అధికారులతో అప్రమత్తం అవసరం. మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. అధికారులు ధనప్రలోభాలకు దూరంగా ఉంచాలి.

ధనస్సు :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. ఉపాధి పథకాలు అంతంత మాత్రంగా సాగుతాయి. సహోద్యోగుల సాయంతో పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. తొందరపడి చెల్లింపులు జరుపవద్దు. సభలు, సమావేశాల్లో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు.

మకరం :- కొన్ని విలువైన వస్తువులు అనుకోకుండా కొనుగోలు చేస్తారు. ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు.

కుంభం :- మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేక అభిమానం కలుగుతుంది. ఆశాదృక్పథంతో ఉద్యోగయత్నం సాగించండి. ఒక కార్యం నిమిత్తం దూర ప్రయాణం చేయవలసి వస్తుంది. మీ బంధవులను సహాయం అర్థించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవడం ఉత్తమం. ఒక అనుభవం మీకెంతో జ్ఞానాన్ని ఇస్తుంది.

మీనం :- ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. మీ ఏమరుపాటు వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారంవుంది. జాగ్రత్త అవసరం. వ్యాపార నష్టాల్లో ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు యూనియన్ వ్యవహారాల్లో రాణిస్తారు. దైవ దీక్షలు రాణిస్తారు. ఉద్యోగస్తులు యూనియన్ వ్యవహారాల్లో పాకిస్తారు. దైవదీక్షలు స్వీకరిస్తారు.

Related Articles

Latest Articles