అక్టోబ‌ర్ 13, బుధ‌వారం దిన‌ఫ‌లాలు…

మేషం:- వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు, ప్రణాళికలు మంచి ఫలితాలనిస్తాయి. అరుదైన శస్త్రచికిత్సలను డాక్టర్లు విజయవంతంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచనస్ఫురిస్తుంది. విద్యార్థుల మొండివైఖరి ఉపాధ్యాయులకు ఆందోళన కలిగిస్తుంది. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది.

వృషభం:- శారీరక శ్రమ, అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. తల పెట్టిన పనులలో విఘ్నాలు, చీటికి మాటికి అసహనం ఎదుర్కొటారు. బ్యాంకు వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ప్రియతములతో ప్రయాణాల్లో ఊహించని చిక్కులు ఎదురయ్యే అవకాశ ఉంది. ఏ మాత్రం పొదుపు సాధ్యంకాడు.

మిథునం:- ఆర్థిక విషయాల్లో ఒకడుగు ముందుకు వేస్తారు. సంఘంలో మంచి గుర్తింపు, రాణింపులభిస్తుంది. ఇతరులు మీ కుటుంబ విషయాల్లో తలదూర్చడంవల్ల ఆందోళనకు గురవుతారు. ఉద్యోగస్తులకు పైఅధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. స్త్రీలకు కాళ్లు, తల, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి.

కర్కాటకం:- ఓర్పు, పట్టుదలతో శ్రమించినగాని చేపట్టిన పనులు పూర్తికావు. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. మీ ప్రియతముల కోసం పిల్లల కోసం ధనం బాగుగా వెచ్చిస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు.

సింహం:- కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ రంగాల్లో వారికి సదవకాశాలు లభిస్తాయి. ఇచ్చుపుచ్చుకొనే వ్యావహారాలలో మెళకువ వహించండి. కాంట్రాక్టర్లకు చేపట్టిన పనులలో ఏకాగ్రత ముఖ్యం. పెద్దల వ్యవహారాలలో జోక్యం చేసుకోవటం వల్ల విమర్శలు తప్పవు. స్త్రీల మనోభావాలు వ్యక్తం చేయడం వల్ల అశాంతికి గురవుతారు.

కన్య:- వాతావరణంలోని మార్పు వ్యవసాయదారులకు ఆందోళన కలిగిస్తుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. దానధర్మాలు చేయడంవల్ల మీ కీర్తి, ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది.

తుల:- ఎప్పటినుండో వాయిదా పడుతూవస్తున్న పనులు పునఃప్రారభమవుతాయి. ప్రలోభాలకు లొంగవద్దు. కాంట్రాక్టర్లకు మంచి మంచి అవకాశాలు లభించిన సద్వినియోగం చేసుకోలేరు. మీ కళత్రమొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి.

వృశ్చికం:- చిన్నారులకు బహుమతులు అందిస్తారు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. వాహన సౌఖ్యం పొందుతారు. ప్రముఖుల ద్వారా ఉద్యోగస్తులు కొత్త పనులు చేపడతారు. వ్యాపారాల్లో ఒడిదుడుకులు, స్వల్ప నష్టాలు ఎదుర్కుంటారు. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు.

ధనస్సు:- ఏదైనా స్థిరాస్తి కొనుగోలు చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. ఫర్నీచర్ అమరికలకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. తలపెట్టిన పనులలో విఘ్నాలు వంటివి తలెత్తుతాయి. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. నిరుద్యోగయత్నాలు ఒక కొలిక్కివస్తాయి.

మకరం:- రాజకీయనాయకులకు పదవీ సమస్యలు అధికమవుతాయి. బంధు మిత్రులతో పట్టింపులను ఎదుర్కుంటారు. స్త్రీల ప్రతిభకు గుర్తింపు, సదావకాశాలు లభిస్తాయి. బ్యాంకు లావాదేవీలు, రుణ యత్నాలకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. మీ అంతరంగిక విషయాలు, కుటుంబ విషయాలు గోప్యంగా ఉంచండి.

కుంభం:- కానివేళలో ఇతరులరాక ఇబ్బంది కలిగిస్తుంది. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు పెరుగుతాయి. ఊహించని ఖర్చులు, తప్పనిసరి చెల్లింపుల వల్ల ఒకింత ఒడిదుడుకులు తప్పవు. ఉద్యోగస్తులకు పైఅధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లకు ఏకాగ్రత ముఖ్యం.

మీనం:- ఒక వ్యవహారం నిమిత్తం న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు, ఇతరత్రా చెల్లింపులు జరుపుతారు. నిత్యావసరవస్తు స్టాకిస్టులకు, వ్యాపారులకు సంతృప్తి. ప్రయాణాలు, బ్యాంకు వ్యవహారాలలో ఏరాగ్రత వహించండి.

-Advertisement-అక్టోబ‌ర్ 13, బుధ‌వారం దిన‌ఫ‌లాలు...

Related Articles

Latest Articles