అక్టోబ‌ర్ 12, మంగ‌ళ‌వారం దిన‌ఫ‌లాలు

మేషం :- ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయి. ఉపాధ్యాయులకు అనుకూలం. కాంట్రాక్టర్లకు ఇప్పటివరకు వాయిదా పడుతున్న పనులు పునఃప్రారంభమవుతాయి. వాహనం నడుపుతున్నపుడు మెళకువ వహించండి. విద్యార్థులకు నూతన పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. ముఖ్యలకు బహుమతులు అందజేస్తారు.

వృషభం :- పత్రికా రంగంలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. నిరుద్యోగులు ఉపాధి పథకాల పట్ల ఆకర్షితులవుతారు. దంపతుల మధ్య కలహాలు తలెత్తుతాయి. కొత్త ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలలో తొందరపాటుతనం విడనాడండి. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.

మిథునం :- ఆర్థిక విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. మిమ్మల్ని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారు అని గమనించండ. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి లాభాలు చేకూరుతాయి. కుటుంబీకులతో కలసి ఆలయాలను సందర్శిస్తారు. రావలసిన ధనం వాయిదా పడటంతో పలు కార్యక్రమాలు ఆగిపోతాయి.

కర్కాటకం :- బంధు మిత్రుల నుంచి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. వైద్యులకు శస్త్ర చికిత్స చేయునప్పుడు మెళుకువ అవసరం. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. దైవకార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థినులకు ప్రేమ వ్యవహారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ముఖ్యం.

సింహం :- పత్రిక ప్రైవేటు సంస్థలలోని వారికి ఊహించని చికాకులు ఎదురవుతాయి. పోస్టల్, టెలిగ్రాఫ్, ఎల్.ఐ.సి., రంగాల వారికి సామాన్యంగా ఉంటుంది. ఒప్పందాలు రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో వాయిదా పడతాయి. ఉపాధ్యాయులకు విద్యార్థులు పట్ల బరువు, బాధ్యతలు అధికమవుతాయి. పెంపుడు జంతువుపట్ల ఆసక్తి పెరుగుతుంది.

కన్య :- రావలసిన ఆదాయం గురించి ఆందోళన చెందుతారు. మీ సంతానం కోసం ధనం బాగా వెచ్చిస్తారు. తరుచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సంతృప్తి పురోభివృద్ధి ప్రముఖుల కలయిక సాధ్యం లేదు. నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు పనివారలతో సమస్యలు తలెత్తుతాయి.

తుల :- మీ పాత సమస్యలు పరిష్కార దిశగా పయనిస్తాయి. ఊహించని ఖర్చులు మీ అంచనాలు చాటుట వల్ల ఆందోళనకు గురవుతారు. బ్యాంకింగ్ రంగాల వారికి చికాకులను ఎదుర్కుంటారు. వీలైతే కీలకమైన నిర్ణయాలు ఈ రోజుకు వెయిదా వేయటం మంచిది. వస్త్ర, బంగారు, వెండి రంగాలకుట్ల ఆసక్తి పెరుగుతుంది.

వృశ్చికం : ఐరన్, సిమెంట్, కలప, ఇటుక, ఇసుక రంగంలో వారికి కలిసివచ్చే కాలం. ప్రింటింగ్ రంగంలోని వారికి అచ్చు తప్పులు దొర్లుట వల్ల పై అధికారుల చేత మాటపడక తప్పుడు. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. ట్రాన్స్‌పోర్టు, మెకానికల్, ఆటోమొబైల్ రంగాలలో వారికి సంతృప్తి కానవస్తుంది.

ధనస్సు :- ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి కలిసివచ్చేకాలం. ఏదైనా స్థిరాస్తి కొనుగోలు, అమ్మకం దిశగా మీ ఆలోచనలు ఉంటాయి. దైవసేవ, పుణ్యకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. విదేశీయానం నిమిత్తం చేసే యత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. శత్రువులు మిత్రులుగామారి సాయాన్ని అందిస్తారు.

మకరం :- దంపతుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. వస్త్ర, బేకరీ వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. రాజకీయాల్లో వారికి ప్రత్యర్థులు వల్ల సమస్యలను ఎదుర్కొంటారు. ఉద్యోగస్థులకు తోటివారి కారణంగా సమస్యలు తలెత్తుతాయి. ఆకస్మికంగా ప్రయాణాలు వాయిదా పడతాయి. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు.

కుంభం :- ప్రత్యర్థుల విషయంలో అప్రమత్తత అవసరం. స్త్రీలు షాపింగులకు ధనం బాగా ఖర్చు చేస్తారు. సన్నిహితులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. మిత్రులతో కలిసి ఆలయాల సందర్శనాలలో ధనం అధికంగా ఖర్చు చేస్తారు. ఇతరుల ముందు మీ కుటుంబ సమస్యలు ఏకరువు పెట్టడం మంచిది కాదని గ్రహించండి.

మీనం :- హోదాలు, పదవీయోగాలు జరిగే సూచనలున్నాయి. ఆకస్మికంగా బిల్లులు చెల్లిస్తారు. నిత్యావసరవస్తు వ్యాపారులకు, స్టాకిస్టులకు అభివృద్ధి కానవస్తుంది. ఒక కార్యం నిమిత్తం దూరప్రాంతానికి ప్రయాణం చేయవలసి రావచ్చు. సంఘంలో మీకు పేరు ప్రఖ్యాతులు పెరుగును. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత ముఖ్యం.

-Advertisement-అక్టోబ‌ర్ 12, మంగ‌ళ‌వారం దిన‌ఫ‌లాలు

Related Articles

Latest Articles