న‌వంబ‌ర్ 16, మంగ‌ళ‌వారం దిన‌ఫ‌లాలు…

మేషం :- విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. వస్త్ర, ఫ్యాన్సీ, మందులు, పచారీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఇంటా బయటా స్త్రీల ఆధిపత్యం కొనసాగుతుంది. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల మెళుకువ అవసరం. బద్దకాన్ని వదలి చురుగ్గా ఉండండి. రవణా రంగాలలోని వారికి సంతృప్తి కానవస్తుంది.

వృషభం :- ఉద్యోగస్తులు యూనియన్ కార్యకలాపాల్లో చురుగ్గా వ్యవహరిస్తారు. ఏ మాత్రం పొదుపు సాధ్యం కాదు. మీకు తెలియకుండానే దుబారా ఖర్చులు చేస్తారు. ఆకస్మికంగా బిల్లులు చెల్లిస్తారు. మీ బాధ్యతలను ఇతరులకు అప్పగించడం మంచిది కాదు. బ్యాంకుల నుంచి పెద్దమొత్తంలో ధనం ద్రా చేసే విషయంలో జాగ్రత్త అవసరం.

మిధునం :- మీ నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువుల చేజారి పోతాయి. విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. సోదరీసోదరులు, సన్నిహితులకు సంబంధించి ఖర్చులు అధికం. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు. ఉపాధ్యాయులు విద్యార్థుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు.

కర్కాటకం :- గృహంలోని మార్పులు, చేర్పులు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. రాజకీయాల్లో వారికి ఆదరాభి మానాలు అధికం అవుతాయి. ఒకే కాలంలో అనేక పనులు చేపట్టడం వల్ల కాంట్రాక్టర్లు సమస్యలకు లోనవుతారు. భాగస్వామ్యుల మధ్య విభేదాలు సృష్టించేవారు అధికమవుతున్నారని గమనించండి. స్పెక్యులేషన్ అనుకూలించదు.

సింహం :- ముఖ్యులతో కలసి పలు కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్నతరహా, కుటీర పరిశ్రమలవారికి ఆశాజనకం. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. మీ కృషికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి సామాన్యం. ఏజెంట్లకు, బ్రోకర్లకు, రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఆశాజనకం.

కన్య :- కిరాణా, ఫ్యాన్సీ, వస్త్ర, బంగారం వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. సంఘంలో ఉన్నతస్థాయి వ్యక్తుల సహాయం పొందుతారు. కోర్టు వ్యవహారాలలో ప్లీడర్లకు ఒత్తిడి తప్పడు. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేయవలసి ఉంటుంది. రాజకీయాల్లో వారికి గుర్తింపు లభిస్తుంది.

తుల :- వస్త్ర, బంగారు, వెండి, వ్యాపారస్తులకు పనివారితో సమస్యలు తప్పవు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. మీ పట్ల ముభావంగా ఉండే వ్యక్తులు మీ సాన్నిత్యం కోరుకుంటారు. ఉద్యోగస్తులకు ఒక అవరాశం చేతిదాకా వచ్చి వెనక్కిపోయే ఆస్కారం ఉంది. ఆరోగ్య, ఆహార విషయాల్లో అధికమైన జాగ్రత్త అవసరం.

వృశ్చికం :- కాంట్రాక్టర్లకు సదవకాశాలు లభించిన ఒత్తిడి తప్పదని చెప్పవచ్చు. నిరుద్యోగులలో నిరుత్సాహం, నిర్లిప్తత అధికమవుతాయి. ఇతరుల కుటుంబ విషయాల్లో తలదూర్చకండి. ప్రేమికులకు మధ్య ఊహించని స్పర్థలు తలెత్తుతాయి. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లకు తమ క్లయింట్లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది.

ధనస్సు :- ఇతరులకు పెద్దమొత్తంలో ధనసహాయం చేయటం వల్ల ఇబ్బందులకు గురికావలసివస్తుంది. కొన్ని వ్యవహరాలు అనుకూలించినా మరి కొన్ని ఆందోళన కలిగిస్తాయి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి.

మకరం :- ఆడిటర్లకు అభివృద్ధి, ప్లీడర్లకు, వైద్యులకు గుర్తింపు పొందుతారు. మిత్రులతో సంభాషించటం వల్ల మీలో మానసిక ధైర్యం, కొత్త ఉత్సాహం చోటుచేసుకుంటాయి. రుణాలు తీరుస్తారు. పారిశ్రామిక రంగంలోని వారి సమస్యలు ఒక కొలిక్కిరాగలవు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు.

కుంభం :- స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలు, ఆరోగ్య విషయంలోను ఏకాగ్రత ఎంతో ముఖ్యం. ఖర్చులు అధికమవుతాయి. మీ పాఠ సమస్యలు, స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి రావటానికి మరి కొంత సమయం పడుతుంది. కుటుంబ సౌఖ్యం అంతగా ఉండదు. విద్యార్థినులలో ఏకాగ్రత లోపం వల్ల చికాకులు, మందలింపులు తప్పవు.

మీనం :- వైద్య, ఇంజనీరింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. రావలసిన ధనం వసూలు విషయంలో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కుంటారు. ప్రైవేటు, పత్రికా సంస్థల్లో వారికి మార్పులు అనుకూలించవు. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి.

Related Articles

Latest Articles