జులై 23, శుక్రవారం దిన‌ఫ‌లాలు

మేషం : శారీరకశ్రమ, విశ్రాంతి లోపం వల్ల స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. మీ సంతానం కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. ఉమ్మడి వ్యాపారస్తులకు అనుకూలమైన రోజు, ఎదుటివారితో మితంగా సంభాషించడం మంచిది. అధికారులకు ఒత్తిడి, తనిఖీలు, పర్యటనలు అధికం. ఫ్లీడర్లకు తమ క్లయింట్ల తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది.

వృషభం : కుటుంబీకుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. సమాచారం లోపం వల్ల నిరుద్యోగులు ఒక అవకాశాన్ని జారవిడుచుకుంటారు. కొబ్బరి, పండ్లు, పూలు, కూరగాయ రంగాలలో వారికి అనుకూలమైన కాలం. స్త్రీలకు స్వీయ అర్జన పట్ల ఆసక్తి, తగు ప్రోత్సాహం లభిస్తాయి. ప్రముఖుల గురించి ఆందోళన చెందుతారు.

మిథునం : ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. ఇతరులకు పెద్ద మొత్తాలలో ధన సహాయం చేసే విషయంలో లౌక్యం ఎంతో అవసరం. విలువైన వస్తువులు, వాహనం కొనుగోలు చేస్తారు. శ్రీమతి సలహా పాటించడం వల్ల చిన్నతనగా భావించకండి. బ్యాంకు వ్యవహారాల్లో జాగరూకతతో మెలగండి.

కర్కాటకం : పత్రికా, వార్తా, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. స్త్రీలకు స్వీయ అర్జన, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. రావలసిన ధనం అందడంతో మీ ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి.

సింహం : బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. ఓర్పుతో అనుకున్న పనులు సాధిస్తారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. కొన్ని వ్యవహారాలు వికటించినా మరికొన్ని లభిస్తాయి. మార్కెట్ రంగాల వారికి లాభదాకయమైన అవకాశం కలిసివస్తుంది. స్త్రీలకు పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి.

కన్య : ఒకేసారి అనేక పనులు మీదపడటంతో అసహనానికి లోనవుతారు. దూర ప్రయాణాలు పుణ్యక్షేత్ర సందర్శనలకు అవాంతరాలు ఎదురవుతాయి. రుణం తీర్చి తాకట్టు వస్తువులు విడిపించుకుంటారు. వైద్యులు అరుదైన ఆపరేషన్లు చేసి మంచి గుర్తింపు పొందుతారు. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాల్లో మార్పులుండవు.

తుల : వస్త్ర వ్యాపారస్తులకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది. రాజకీయాల్లో వారికి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. అధికారులతో సంభాషించేటపుడు మెళకువ వహించండి. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. స్టేషనరీ రంగాలలో వారికి నిరుత్సాహం. ఆకస్మిక ఖర్చులు మనశ్శాంతిని దూరం చేస్తాయి.

వృశ్చికం : సమయస్ఫూర్తిగా వ్యవహరించి ఒక అవకాశాన్ని మీకు అనుకూలంగా మలుచుకుంటారు. తల, కాళ్లు, నరాలకు సంబంధించిన చికాకులు అధికంగా ఉంటాయి. ప్రైవేటు సంస్థలలోనివారు, సహకార సంఘాలలో వారు పనిలో ఏకాగ్రత వహించలేకపోవుట వల్ల అధికారులతో మాటపడవలసి వస్తుంది.

ధనస్సు : పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాల్లో వారికి అనుకూలిస్తుంది. ఇతర దేశాలు వెళ్లటానికి చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొబ్బరి, పండ్లు, పూల, బేకరీ వ్యాపారులకు సంతృప్తి, పురోభిృద్ధి. పారిశ్రామిక రంగంలోని వారికి సంబంధ బాంధవ్యాలు పెరుగును. మీ మిత్రులతో ఒక వైఖరి మీకు చికాకులు కలిగించును.

మకరం : ఎప్పటి నుంచో వాయిదాపడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభమవుతాయి. ఒంటరిగానే లక్ష్యాలను సాధిస్తారు. ఉద్యోగస్తులు ఓర్పుతో వ్యవహరిస్తారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి అవకాశాలు లభిస్తాయి. క్రీడల పట్ల ఆసక్తి పెరుగును పాత రుణాలు, బిల్లులు చెల్లించగలవుతారు.

కుంభం : ఆర్థిక విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. విదేశాలు వెళ్లడానికి చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి పనులు కారణంగా కుటుంబ సభ్యులకు ఇచ్చిన వాగ్ధానాలు నిలుపుకోలేకపోతారు.

మీనం : ఉద్యోగస్తులకు సమర్థంగా పనిచేసి పై అధికారుల మన్ననలను, ప్రశంసలను పొందుతారు. దూకుడుగా వాహనం నడిపి ఇబ్బందులకు గురవుతారు. స్టాకిస్టులకు, బ్రోకర్లకు, ఏజెంట్లకు అనుకూలం. ప్రతి విషయంలోనూ స్వయం కృషిపైనే ఆధారపడటం మంచిది. ఇతరుల సమస్యలను తేలికగా పరిష్కరిస్తారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-