జులై 20, మంగళవారం దిన‌ఫ‌లాలు

మేషం : ఉపాధ్యాయులకు ఆర్థిక ప్రగతితో కూడిన అవకాశాలు లభిస్తాయి. పాత వస్తువులను కొని ఇబ్బందులు ఎదుర్కొంటారు. రుణాల కోసం అన్వేషిస్తారు. పత్రికా, వార్తా మీడియా వారికి ఊహించని సమస్యలు ఎదురవుతాయి. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. విత్తన వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి.

వృషభం : ఆర్థిక ఇబ్బందులు క్రమంగా సర్దుకుంటాయి. వ్యాపారాల అభివృద్ధికి స్థల మార్పు అవసరం. బ్యాంకు పనుల్లో మెళకువ అవసరం. ఓర్పు, విజ్ఞతతో మీ గౌరవం కాపాడుకుంటారు. నిరుద్యోగులు ఆశాదృక్పథంతో యత్నాలు సాగించాలని. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిదికాదు.

మిథునం : ఉద్యోగస్తులకు అధికారులతో పర్యటనలు, ఒత్తిడి అధికం. పెద్ద మొత్తం ధన సహాయం క్షేమం కాదు. మీరంటే అందరికీ గౌరవం ఏర్పడుతుంది. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. భాగస్వామిక ఒప్పందాల్లో మీ నిర్ణయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. గుట్టుగా యత్నాలు సాగించండి.

కర్కాటకం : బాధ్యతాయుతంగా వ్యవహరించి అధికారుల మన్నలు పొందుతారు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. గత విషయాలు జ్ఞప్తికి వస్తాయి. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలిస్తాయి. స్త్రీలు పనివారలతో చికాకులు ఆరోగ్యపరమైన చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది.

సింహం : వార్తా సంస్థలలోని సిబ్బందికి మార్పులు అనుకూలిస్తాయి. ముఖ్యమైన విషయాల్లో మీ శ్రీమతి సలహా పాటించడం మంచింది. స్థిరచరాస్తుల విక్రయంలో పునరాలోచన అవసరం. ఖర్చులు అధికం. ధనం పొందుపు చేయాలన్ని మీ సంకల్పం నెరవేరదు. ఇతరుల సహాయం అర్థించడం వల్ల మీ గౌరవానికి భంగం కలుగవచ్చు.

కన్య : కలప, సిమెంట్, ఐరన్, ఇటుక వ్యాపారులకు పురోభివృద్ధి. చేపట్టి పనులు సకాలంలో పూర్తికాకపోవడంతో నిరుత్సాహానికి గురవుతారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. స్త్రీలకు బంధువులు, చుట్టుపక్కల వారితో అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. వృత్తి ఉద్యోగస్తులకు గణనీయమైన పురోభివృద్ధి ఉంటుంది.

తుల : వృత్తుల వారికి అన్ని విధాలా కలిసిరాగలదు. కపటం లేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది. బంధువులతో విభేదాలు తొలగి రాకపోకలు అధికమవుతాయి. విద్యార్థులకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ముఖ్యం. పెద్దలతో ఆస్తి విషయాలు సంప్రదింపులు జరుపుతారు.

వృశ్చికం : ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. అద్దె ఇంటి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కళా, ఫోటోగ్రఫి ఉన్నత విద్య విదేశీ వ్యవహారాల రంగాల వారికి అనుకూలం సమయం. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రత్తి పొగాకు రంగాలలో వారికి అనుకూలమైన రోజు.

ధనస్సు : కుటుంబంలో చిన్న చిన్న చికాకులు తలెత్తినా క్రమంగా సమసిపోగలవు. కొంతమంది మీ సరసపు వ్యాఖ్యలు తీవ్రంగా పరిగణించే ఆస్కారం ఉంది. ఖర్చులు అధికంగానే ఉంటాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నూతన దంపతుల మధ్య అవగాహన, ప్రేమాభిమానాలు చోటుచేసుకుంటాయి.

మకరం : కుటుంబీకుల నిర్లక్ష్యం వైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. మెడికల్ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. సాహస ప్రయత్నాలు విరమించండి. ప్రయాణాలు వాయిదావేయడం మంచిది. వాక్ చాతుర్యంనకు అనుకూలంగా ఉండగలదు. ప్రేమ వ్యవహారాలలో విజయం పొందటానికి మరికాస్త కృషి చేయాలి.

కుంభం : పారిశ్రామిక రంగం వారికి అధికారుల వేధింపులు, కార్మిక సమస్యలు అధికం అవుతాయి. సతీమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. శత్రువులు, మిత్రులుగా మారుతారు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఒకరికి సలహా ఇచ్చి మరొకరికి వ్యతిరేకులవుతారు.

మీనం : నిత్యావసర వస్తుస్టాకిస్టులకు, వ్యాపారులకు సంతృప్తినిస్తాయి. ఆడిటర్లకు, అకౌంట్స్ రంగాల వారికి పనిభారం తగ్గుతుంది. రాజకీయ నాయకులకు పదవీ సమస్యలు అధికమవుతాయి. గృహమునకు కావలసిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కాని వేళలో బంధుమిత్రుల రాక ఇబ్బంది కలిగిస్తుంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-