జులై 14 బుధవారం దినఫలాలు

మేషం : రాజీ మార్గంతో సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆప్తులతో నిజాయితీగా మెలగండి. అధికారులు సహోద్యోగులతో చికాకులు ఎదుర్కొంటారు. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. స్త్రీల ప్రతిభకు అవకాశాలు కలిసివస్తాయి. హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులకు పురోభవృద్ధి. వైద్యులు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేస్తారు.

వృషభం : ఉద్యోగస్తులకు యూనియన్ సభ్యులతో సమస్యలు, చికాకులు తప్పవు. ప్రముఖుల ప్రశంసలు పెద్దల ఆశీస్సులు పొందుతారు. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. పెద్దల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం తగదు. పరిచయాలు, వ్యాపకాలు పెంపొందుతాయి. వైద్యులకు ఆపరేషన్లను చేయునపుడు మెళకువ అవసరం.

మిథునం : కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకం. దేవాలయ, విద్యా సంస్థలకు దానధర్మాలు చేయుట వల్ల మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తారు. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి అనుకూలం. అధికారుల ఇంటర్వ్యూ కోసం నిరీక్షిస్తారు. ఉద్యోగస్తుల దైనందిన కార్యకలాపాలు ప్రశాంతంగా సాగుతాయి.

కర్కాటకం : ఆర్థిక విషయాలలో కొంత పురోభివృద్ధి కానవస్తుంది. ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యం తీరు విరక్తి కలిగిస్తుంది. పట్టువిడుపు ధోరణితోనే మీ సమస్యలు పరిష్కారమవుతాయి. వాహనం కొనుగోలుకై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన ప్రణాళికలు సత్ఫలితాలను ఇవ్వగలవు.

సింహం : పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి అభద్రతాభావం, ఆందోళనలకు గురవుతారు. ఏవైనా చిన్నచిన్న సమస్యలు తలెత్తినా తాత్కాలికమేనని గ్రహించండి. రుణాల కోసం అన్వేషిస్తారు. స్త్రీలు తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. అధికారులకు ఆకస్మిక స్థానచలనం, బాధ్యతల మార్పు సంభవం.

కన్య : కుటుంబంలోనూ, బయటా ఊహించని సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. దూర ప్రయాణాలలో మెళకువ చాలా అవసరం. పాత వస్తువులను కొని సమస్యలు తెచ్చుకోకండి. స్థిరాస్తి కొనుగోలు లేదా అభివృద్ధి దిశగా మీ ఆలోచనలు ఉంటాయి.

తుల : నిరుద్యోగులు నిరుత్సాహం విడనాడి శ్రమించిన సదావకాశాలు లభిస్తాయి. ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. బంధు మిత్రులతో రహస్య సంభాషణలు కొనసాగిస్తారు. ఆధ్యాత్మిక విషయాలు, దాన ధర్మాలకు ఖర్చులు చేస్తారు. స్త్రీల అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల భంగపాటుకు గురువుతారు.

వృశ్చికం : స్త్రీలకు చుట్టు పక్కలవారితో విభేదాలు తలెత్తుతాయి. తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులు ఒత్తిడి, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రింటింగ్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. చిన్నారుల ప్రవర్తన ఆవేదన కలిగిస్తుంది. కుటుంబీకుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తారు.

ధనస్సు : ఆర్థిక లావాదేవీలు ఊహించని విధంగానే ఉంటాయి. ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు సంతృప్తినిస్తాయి. మీ నూతన ఆలోచనలు క్రియా రూపంలో పెట్టి జయం పొందండి. ఉద్యోగస్తుల శ్రమను అధికారులు గుర్తిస్తారు. ఖర్చులు మీ అంచనాలు మించడంతో ఒడిదుడుకు ఎదుర్కొంటారు.

మకరం : నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు ఒత్తిడి పెరుగుతుంది. అదనపు ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. ప్రముఖుల ప్రమేయంతో ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. దైవ, పుణ్య సేవా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. సన్నిహితుల సలహాలు మీలో కొత్త ఉత్సాహం కలిగిస్తాయి.

కుంభం : రచయితలకు పత్రికా రంగంలో వారికి ప్రోత్సాహం కానవస్తుంది. ముఖ్యుకు బహుమతులు అందజేస్తారు. గతంలోని వ్యక్తులు తారసపడతారు. పోస్టల్ కొరియర్ రంగాల వారికి ఒత్తిడి, త్రిప్పట తప్పదు. లౌక్యంగా వ్యవహరించి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటారు. దంపతుల మధ్య చికాకులు తలెత్తుతాయి.

మీనం : విదేశీ వ్యవహారాల రంగాలకు చెందిన వారికి ఆర్థికంగా ప్రోత్సాహంకరంగా ఉంటుంది. రావలసిన ధనం అందుతుంది. విద్యాసంస్థలలోని వారికి అనుకూలంగా ఉండగలదు. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. కొన్ని వ్యవహారాల్లో జరిగిన కాలయాపన వల్ల ఒకింత ఒడిదుడుకులు తప్పవు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-