నానక్ రాంగూడలో సిలిండర్ బ్లాస్ట్.. అందుకేనా?

హైదరాబాద్‌లోని నానక్ రాంగూడలో సిలిండర్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో తొమ్మిది మందికి గాయాలు కాగా, ఇద్దరి పరిస్థితి విషమంగా వుంది. 3 అంతస్థులలో సిలిండర్ పేలుడు ధాటికి గదులు కూలిపోయాయి. ఉదయం సిలిండర్ పేలుడు సంభవించింది. ఒకే సిలిండర్ కు మూడు కనెక్షన్స్ పెట్టడంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

ఒక కనెక్షన్ లీకేజ్ తోనే ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన భవనంలో సుమారు 50 మంది నివాసం వుంటున్నారు. భవనంలో ఎక్కువగా యూపీ బీహార్ కు చెందిన కార్మికులు నివశిస్తున్నారు. బిల్డింగ్ లో ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు జిహెచ్ఎంసీ అధికారులు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 11 మందికి మాత్రమే గాయాలు అయినట్లు గుర్తించారు. మిగతా వారిని భవనం‌ ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. సురక్షా పైప్ కాకుండా… సాధారణ పైప్ వాడారని తెలుస్తోంది. టీ జాయింట్ కనెక్టర్ ని వాడి… ఒకే పైప్ కి రెండు స్టవ్ లను పెట్టుకున్నారు. వాడుతున్నది సిలిండర్ కమర్షియల్ సిలిండర్. స్టవ్ కి నాబ్స్ కూడా లేవు. ప్రమాదం జరిగిన రూమ్ లో రెండు సిలిండర్లు ఉన్నాయి. ఒకటి బ్లాస్ట్ అయ్యిందని విచారణలో తేలింది. కేసు నమోదుచేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

Latest Articles