నిరుద్యోగులను టార్గెట్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు

సైబర్ నేరగాళ్ళ మోసాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఏదో ఒక రూపంలో అమాయకులు నుండి అందిన కాడికి దోచుకుంటున్నారు.‌ తాజాగా సీసీఎస్ సైబర్ క్రైం టీమ్ లు రెండు ముఠాల గుట్టు రట్టు చేశాయి..ఉద్యోగాల పేరుతో, బహుమతుల పేరుతో మోసాలు చేస్తున్న రెండు సైబర్ గ్యాంగ్ లను అరెస్ట్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు.. ఢిల్లీ లోని ఓ కాల్ సెంటర్ పై రైడ్ చేసి 10 మందిని అరెస్ట్ చేయగా, మరో ఇద్దరు నైజీరియన్లను పెట్టుకున్నారు..

షైన్ వెబ్ సైట్ లో హైదరాబాద్ కు చెందిన ఓ యువతి ఎయిర్ హోస్టెస్ పోస్ట్‌కు అప్లై చేసింది. ఈ వెబ్ సైట్ నుండి ఉద్యోగాలు కోసం పోస్ట్ చేస్తున్న నిరుద్యోగులు వివరాలను సేకరిస్తోంది.. అలా వివరాలు సేకరించి జాబ్ లు కల్పిస్తామంటూ పలు నిరుద్యోగులకు కాల్స్ చేయడం చేస్తోంది ఢీల్లీ ముఠా.. ఇందులో భాగంగా హైదరాబాద్‌కు చెందిన ఓ యువతికి ఫోన్ చేసింది. ఈ ముఠా ఇండిగో ఎయిర్ లైన్స్ లో టికెటింగ్ సెక్షన్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఆ యువతిని నమ్మించింది. ఆఫర్ లెటర్లు, ఇతర పలు కారణాలు చెప్తూ ఆ యువతి నుండి దాదాపుగా ఎనిమిది లక్షల రూపాయల వరకు వసూలు చేసింది ఢిల్లీకి చెందిన ఓ ముఠా.. ఇంతకీ ఉద్యోగం రాకపోవడంతో సీసీఎస్ సైబర్ క్రైమ్‌ను ఆశ్రయించింది.

దర్యాప్తు ప్రారంభించిన సైబర్ క్రైమ్ టీమ్ ,ఉద్యోగాల పేరుతో నగర యువతను చిట్ చేస్తున్న ఈ ముఠాలో మొత్తం ఐదుగురు యువతులు, ముగ్గురు యువకులు ఉన్నట్లు గుర్తించారు. ఢిల్లీ కేంద్రంగా కొనసాగుతున్న ఈ కాల్ సెంటర్ పై సైబర్ క్రైమ్ టీమ్ దాడి చేసింది.. మొత్తం పదిమందిని అరెస్టు చేసి హైదరాబాద్ కు తీసుకు వచ్చినట్లు సీసీ ఎస్ డీసీపీ గజారవు భూపాల్ తెలిపారు.

ఈ కేసులో నిందితులను మరోసారి విచారిస్తే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. ముఠా నుండి. 26 మొబైల్ ఫోన్స్,లాప్ టాప్,… స్వాధీనం చేసుకున్నరు పోలీసులు.

మరో కేసులో నగరవాసులు
బహుమతులు గిఫ్ట్స్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు నైజీరియన్లను అరెస్ట్ చేసారు సైబర్ క్రైమ్ పోలీసులు. గిప్ట్ ల పేరుతో మోసాలు చేస్తున్న ఇద్దరు యుపి కి చెందిన సైబర్ నిందితులను అరెస్ట్ చేశారు. ఉత్తర్‌ప్రదేశ్ లో ఈ ఇద్దరిని పట్టుకున్నారు. డాక్టర్ హ్యారీ రాబర్ట్ పేరుతో తాను అమెరికన్ సిటిజన్ అంటూ బేగంపేట్ కు చెందిన వ్యక్తికి పరిచయం చేసుకున్నారు.
సెలవుల్లో ఇండియాకు రావడానికి ప్లాన్ చేసుకుంటున్నామని నమ్మిచింది ఈ ముఠా బాధితుడికి మొబైల్, ల్యాప్ టాప్, వాచ్ లను కొనుగోలు చేసినట్లు చెప్పి చిట్ చేశారు . జులై 12న ఢిల్లీలో ల్యాండ్ అవుతున్నట్లు చెప్పి,ఆ తరువాత ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్‌నంటూ బాధితుడికి ఫోన్ కాల్స్ చేసి బాధితుడు బ్యాంక్ అకౌంట్ నుండి 9లక్షల రూపాయలను ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నరు. ఈ బ్రాండ్ లో ఇద్దరు నైజీరియన్ లను పట్టుకున్నారు.

ఈ రెండు కేసుల్లో బాధితులు మొత్తం 17లక్షల రూపాయలు మోసపోయారు. ఆలస్యంగా మోసపోయామని గుర్తించి సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశారు.నిందితుల నుంచి మొబైల్ ఫోన్ డెబిట్,క్రెడిట్ కార్డ్స్ పలు బ్యాంకుల పాస్ బుక్ లు స్వాధీనం చేసుకున్నామరు పోలీసులు. ఎలాంటి అనుమానం కలిగిన వెంటనే ప్రజలలు పోలీసులను సంప్రదించాలని సీసీఎస్ డీసీపీ గజరావు భూపాల్ విజ్ఞప్తి చేశారు..

rameshvaitla

Related Articles

Latest Articles