రెచ్చిపోతున్న సైబర్‌ నేరగాళ్లు..

రోజురోజుకు సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులను టార్గెట్‌ చేస్తూ వారి వద్ద నుంచి లక్షలు దండుకుంటున్నారు. ఓ వ్యక్తిని బ్లాక్‌ మెయిల్‌ చేసి రూ.2.89లక్షలు వసూలు చేశారు. తనకు సంబంధించిన న్యూడ్ ఫోటోలను సదరు వ్యక్తి బంధువులకు పంపుతామని బెదిరించారు. దీంతో ఆ వ్యక్తి సైబర్‌ నేరగాళ్లకు డబ్బులు పంపించారు.

సైబర్‌ నేరగాళ్ల వేధింపులు అధికమవడంతో బాధితుడు సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో పాటు మరో వ్యక్తిని ఇన్వెస్ట్‌మెంట్‌ పేరుతో 4 లక్షలు మోసం చేశారు సైబర్‌ నేరగాళ్లు. బాధితుడు సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Related Articles

Latest Articles