సైబరాబాద్ లో మందుబాబుల పై కొరడా…

సైబరాబాద్ లో మందు బాబుల పై కొరడా ఝుళిపిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ ఏడాది లో డ్రంకెన్ డ్రైవ్ చేసిన 2119 మంది డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసారు. నగరంలో 30 శాతం రోడ్ ప్రమాదాలకు డ్రంకన్ డ్రైవ్ కారణం. ఇక్కడ మొత్తం 802 డ్రంకెన్ డ్రైవ్ ప్రమాదాలు చోటు చేసుకోగా 161 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 745 మంది గాయలపాలయ్యారు ఈ ఏడాది లో 7 నెలల వ్యవధిలో 23,368 మంది పై డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు చేసారు పోలీసులు. 3629 మంది డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయాలని ఆర్టీఏ కు పంపారు సైబరాబాద్ పోలీసులు. అందులో ఇప్పటికే 2119 మంది లైసెన్స్ లు రద్దు చేసింది ఆర్టీఏ. లైసెన్స్ రద్దైనా వాహనం నడిపిన 31 మంది పై క్రిమినల్ కేసులు నమోదు చేయరు పోలీసులు.

Related Articles

Latest Articles

-Advertisement-