బ్యాంక్ ఖాతాల నుంచి 3 కోట్లు కాజేసిన సైబర్‌ నేరగాళ్లు…

ఢిల్లీలో ఓ కాల్‌ సెంటర్‌ పై సైబరాబాద్ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దాడి చేసారు. కాల్‌ సెంటర్‌లోని 16 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కాల్‌ సెంటర్‌లోని 23 మందిలో 16 మంది అరెస్ట్‌ కాగా ఏడుగురు పరారీ అయ్యారు. బ్యాంక్‌ అధికారులమంటూ మోసాలకు పాల్పడిన ఆ ముఠాను అరెస్ట్‌ చేసారు. పలువురి ఖాతాల నుంచి 3 కోట్లు కాజేశారు సైబర్‌ నేరగాళ్లు. పలు ఫిర్యాదుల మేరకు ఢిల్లీ వెళ్లి ముఠాను పట్టుకుంది ప్రత్యేక బృందం. ఢిల్లీ పోలీసుల సాయంతో ముఠాను అరెస్ట్‌ చేసారు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు. నిందితుల నుంచి ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఆ నిందితులను మధ్యాహ్నం మీడియా ముందుకు తీసుకురానున్నారు.

Related Articles

Latest Articles