కూకట్ పల్లి కాల్పుల‌ కేసును ఛేదించిన పోలీసులు…

కూకట్ పల్లి కాల్పుల‌ కేసును ఛేదించారు పోలీసులు. దీని పై సైబరాబాద్ సీపీ సజ్జనార్ మాట్లాడుతూ… ఏప్రిల్ 29న కూకట్ పల్లి లోని HDFC ఏటీఎం సెంటర్ లో జరిగిన కాల్పుల ఘటనను ఛేదించాము. సెక్యూటీ గార్డ్ పై కాల్పులు జరిపి 5 లక్షలు దోచుకెళ్లారు. అజిత్ కుమార్ , ముఖేష్ కుమార్ అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసాం. నిందితులు ఇద్దరు బీహార్ కు చెందిన వారు. వారి వద్ద నుండి 6 లక్షల 31 వేలు నగదు, వేపన్ -01, మ్యాగజిన్-01, లైవ్ రౌండ్స్ -3.2, మొబైల్ ఫోన్స్ -03, టూ విల్లర్ వెకిల్ -01, స్వాధీనం చేసుకున్నాం. జీడిమెట్ల లో జరిగిన కేసులో కూడా వీరే ప్రధాన నిందితులు. ఆర్ధిక ఇబ్బందులు, తగుడికి బానిస అయి ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారు. అజిత్ కుమార్ పై గతంలో 2018 దుందిగల్ లో బ్యాంక్ లో ఉన్న క్యాషియర్ ను బెదిరించి పారిపోయారు. అప్పట్లో అరెస్ట్ అయి జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. 30 వేలు స్నేహితుడికి ఇచ్చి కంట్రీ వేపన్ బీహార్ నుండి తీసుకొచ్చారు. గతంలో కూడా అనేక నేరాలకు పాల్పడ్డారు. చోరీ చేసిన పల్సర్ బైక్ మీద వచ్చి కూకట్ పల్లిలో కాల్పులకు తెగబట్టారు..

కాల్పుల్లో సెక్యూటీ గార్డ్ అలీ ఛాతికి బుల్లెట్ తగిలింది. దింతో సెక్యూటీ గార్డ్ అలీ బేగ్ చనిపోయాడు. సైబరాబాద్ 3 కేసులు, రాచకొండ లో ఒక కేసు ఈ నిందితుల పై నమోదు అయ్యాయి. పక్క సమాచారంతోని కూకట్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. సయింటిఫిక్ ఏవిడెన్స్,టెక్నికల్ ఏవిడెన్స్ కలెక్ట్ చేసి నిందితులను గుర్తించాము. తక్కువ సమయంలో నిందితులను పట్టుకున్నాము. ఏటీఎం సెంటర్ల లో కావాల్సిన సెక్యూటీ గార్డులను ఏర్పాటు చేసుకోవాలి. ఎక్కువ వయస్సు ఉన్న వారిని సెక్యూటీ గార్డులు గా పెట్టుకోవడం వలన ఇలాంటి నేరాలు పెరుగుతున్నాయి అని తెలిపారు.

IFrame
-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-