కూక‌ట్‌ప‌ల్లి కాల్పుల్లో ఒక‌రు మృతి.. రంగంలోకి పోలీసులు

కూక‌ట్‌ప‌ల్లిలో కాల్పులు క‌ల‌క‌లం సృష్టించాయి.. ఏటీఎం మిషన్‌లో డబ్బులు రీఫిల్ చేస్తుండగా కాల్పులు జ‌రిపిన ఆగంత‌కులు.. డ‌బ్బుల‌తో ప‌రార‌య్యారు.. అయితే.. కాల్పుల్లో గాయపడ్డ సెక్యూరిటీ గార్డు అలీ.. ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.. ఆగంత‌కుల కాల్పుల్లో అలీ పొట్టలోకి దూసుకెళ్లింది బుల్లెట్‌.. దీంతో.. ఆయ‌న మృతిచెందిన‌ట్టు సైబ‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్ మీడియాకు తెలిపారు.. ఇక‌, ఈ ఘ‌ట‌న‌తో రంగంలోకి దిగిన సైబ‌రాబాద్ పోలీసులు.. పూర్తిస్తాయిలో ద‌ర్యాప్తు ప్రారంభించారు.. ఇది పాత నేరస్థుల ప‌నే అంటున్నారు సీపీ స‌జ్జ‌నార్.. కాల్పులు జ‌రిపి 5 లక్షల రూపాయలతో దుండ‌గులు ప‌రార‌య్యార‌న్న ఆయ‌న‌… కాల్పులు జరిపిన ఒక మ్యాగ‌జై‌న్‌ను స్వాధీనం చేసుకున్న‌ట్టు తెలిపారు.. పల్సర్ బైక్ పై వచ్చిన ఇద్దరు ఆగంత‌కులు ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డ్డార‌ని.. వారి వ‌య‌స్సు 25 నుండి 30 సంవత్సరాల వ‌ర‌కు ఉంటుంద‌న్నారు.. దోపిడీకి కంట్రీ మేడ్ రివాల్వర్ వాడార‌ని.. ఇది బయట గ్యాంగ్ ప‌నే అని అనుమానాన్ని వ్య‌క్తం చేశారు సీపీ.. కాల్చిన తీరు చూస్తే వాళ్లు పక్క ప్రొఫెషనల్స్ గా తెలుస్తుంద‌న్నాయ‌న‌.. ఇప్ప‌టికే మొత్తం ఆరు స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశాం.. ఖచ్చితంగా పట్టుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు.

Related Articles

Latest Articles

-Advertisement-