వైసీపీ ఎంపీకి సైబర్ చీటర్ ఝలక్‌

సైబర్‌ నేరగాళ్లు ఎవ్వరిని వదలడం లేదు. ప్రముఖులను సైతం ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తాజాగా తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తికి సైబర్‌ చీటర్‌ ఫోన్‌ చేసి డబ్బులు డిమాండ్‌ చేయడం కలకలం రేపుతుంది. సీఎంఓ కార్యాలయంలో పనిచేస్తున్నట్టు సైబర్‌ ఛీటర్‌ అభిషేక్‌గా పరిచయం చేసుకున్నారు. ఖాదీ పరిశ్రమ సబ్సిడీ రుణాల కింద రూ. 5కోట్లు మంజూరైనట్లు చెప్పిన అభిషేక్.మంజూరైన రుణాలు కావాలంటే తన అకౌంట్‌లో డబ్బులు వేయాలని డిమాండ్‌ చేసిన సైబర్‌ చీటర్‌ అభిషేక్‌.

Read Also: ఇకనైనా విహారికి అవకాశం ఇవ్వండి: గంభీర్

25 దరఖాస్తులకు ఒక్కొక్క దరఖాస్తుకు 1.5లక్షలు వేయాలని డిమాండ్ చేశాడు. దీంతో సీఎంఓ కార్యాలయానికి ఎంపీ గరుమూర్తి ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకుని ఆ పేరుతో ఎవ్వరూ లేరని నిర్ధారించుకున్నారు. అనంతరం ఈ విషయం పై అర్బన్ జిల్లా ఎస్పీకీ ఎంపీ పీఏ రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. మెయిల్‌ ద్వారా తన వివరాలను ఎంపీకి పంపిన సైబర్‌ చీటర్‌ అభిషేక్‌. సైబర్ ఛీటర్‌ను పట్టుకునే పనిలో నిమగ్నమైన అర్బన్‌ జిల్లా పోలీసులు త్వరలోనే అభిషేక్‌ను పట్టుకుంటామని చెప్పారు. సైబర్‌ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలని ఎంపీ ప్రజలను కోరారు.

Related Articles

Latest Articles