రోజురోజుకు అప్డేట్ అవుతున్న సైబర్ నేరగాళ్లు…

ఓఎల్ఎక్స్ లో కొత్త రకం నేరాలు వెలువడుతున్నాయి. రోజురోజుకు అప్డేట్ అవుతున్నారు సైబర్ నేరగాళ్లు. కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు భరత్ పూర్, అల్వార్ గ్యాంగ్ లు. పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని భరత్పూర్ గ్యాంగ్ తిరుగుతుండగా.. రాజస్థాన్ లోని అల్వార్ కు చెందిన 7 మందిని అరెస్ట్ చేసారు సిటీ పోలీసులు. అయితే ఇప్పుడు ఓఎల్ఎక్స్ లో ఇప్పుడు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు చీటర్స్. ఓఎల్ఎక్స్ లో వచ్చే ప్రతి వస్తువును కొంటామని ఆఫర్ చేస్తున్న కేటుగాళ్లు.. వస్తువుల కొనుగోలు పేరుతో క్యూ ఆర్ కోడ్ ని పంపిస్తున్నారు. క్యూ ఆర్ కోడ్ స్కానింగ్ చేయగానే మన అకౌంట్ లో ఉన్న డబ్బులు కొట్టేస్తున్నారు కేటుగాళ్ళు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వేల మందిని సైబర్ నేరగాళ్లు మోసం చేయగా… రెండు రాష్ట్రాల్లో కలిపి వందల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-