సైబర్ నేరాలు.. అమ్మాయిల వ్యక్తిగత విషయాలతో బ్లాక్ మెయిల్

ఎప్పటికప్పుడు వస్తున్నా కొత్త టెక్నాలజీతో సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయి. ఈ విషయంలో సైబర్ నేరగాళ్లు కూడా అప్డేట్ అవుతున్నారు. వచ్చిన అవకాశాలు వదులుకోకుండా అమాయకుల్ని బురిడీ కొట్టిస్తున్నారు. సైబర్ నేరాలకు చెక్ పెడుతున్నామని చెపుతున్న పోలీసులకు కొత్త సవాల్ విసురుస్తున్నారు నేరగాళ్లు. బ్యాంకు వివరాలు అంటూ కాల్స్ రావడమే ఆలస్యం.. డబ్బులు కట్ అయిపోతున్నాయంటూ వచ్చే కేసుల సంఖ్య పెరిగిపోతుంది. మరోవైపు మీకు లాటరీ వచ్చిందంటూ ఫోన్ చేసి తీరా వచ్చాక పాలసీలు, డిపాజిట్లు చెల్లించాలి అంటూ డబ్బులు వసూలు చేసే ముఠాలు అధికమయ్యాయాయి. ఇందులో చదువుకున్న వారు కూడా లేకపోలేదు. పెద్ద పెద్ద కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కోట్లు కొట్టేస్తున్నారు.

గత కొద్దిరోజులుగా విశాఖ నగరవాసులపై సైబర్ నేరగాళ్లు గురిపెట్టారు. రాష్ట్రంలోని ఎక్కడ లేని విధంగా విశాఖంలోనే ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి. ప్రధానంగా మహిళలను లక్ష్యంగా చేసుకొని రెచ్చిపోతున్నారు నేరగాళ్లు. వ్యక్తిగత వివరాలు సేకరించి.. వాటి ఆధారంగా బెదిరింపులకు పాల్పడుతున్నారు. అలాంటి పరిస్థితి ఎదురైతే తమకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు పోలీసులు. పెరుగుతున్న సైబర్ నేరాలపై పోలీసులు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-