భారీగా ఈము కోడి, నిప్పు కోడి రెక్కలు స్వాధీనం

రాజస్థాన్ లోని జైపూర్ అంతర్జాతీయ పోస్టాఫీసులో భారీగా ఈము కోడి, నిప్పు కోడి రెక్కలు, ఓ తలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జైపూర్ నుండి లండన్ వెళుతున్న రెండు పార్సల్ లో నిప్పు కోడికి సంబంధించిన రెక్కలు, తల భాగమును కస్టమ్స్ అధికారుల బృందం గుర్తించింది. ఏమాత్రం అనుమానం రాకుండా కొరియర్ ద్వారా విదేశాలకు పక్షుల రెక్కలు తరలిస్తున్నారు. అటవీశాఖ నిబంధనలకు విరుద్దంగా స్మగ్లింగ్ కు తెరలేపిన ఈ కేటుగాళ్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడ్డ వీటి విలువ ఎంత ఉంటుందనే విషయాన్ని అధికారులు ఆరా తీస్తున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-