భారీగా బంగారం, పెర్ఫ్యూమ్స్ సీజ్

బంగారం అక్రమ రవాణాకు దేన్నీ వదలడం లేదు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుండి అక్రమంగా స్మగ్లింగ్ చేస్తున్న 18 లక్షల విలు చేసే బంగారం, ఐ ఫోన్ లతో పాటు పెర్ప్యూమ్ బాటిల్స్ ను సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా బంగారాన్ని, ఐ ఫోన్లను, పెర్ప్యూమ్ బాటిల్స్ లగేజ్ బ్యాగ్ లో దాచి తరలించే ప్రయత్నం చేశారు.

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు నిర్వహించిన స్కానింగ్ లో బయట పడ్డ స్మగ్లింగ్ వస్తువులు చూసి అంతా అవాక్కయ్యారు. బంగారం, ఐ ఫోన్ లతో పాటు పెర్ప్యూమ్ బాటల్స్ సీజ్. ప్రయాణీకుడిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు. ఈమధ్యకాలంలో అంతర్జాతీయ కస్టమర్లు ఇతర దేశాల నుంచి తెచ్చుకునే వస్తువుల్లో బంగారం స్మగ్లింగ్ చేస్తున్నారు.

Related Articles

Latest Articles